నటసౌమ్యుడు రంగనాథ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(జూలై 17న రంగనాథ్ జయంతి)
సౌమ్యుడు అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం నటుడు రంగనాథ్. చిత్రసీమలో ఇలాంటి సున్నిత మనస్కులు ఉంటారా? అనిపించేది ఆయనను చూస్తే. అసలు అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి చిత్రసీమలో ఎలా రాణించారు అన్న అనుమానం కూడా కలిగేది. ప్రతిభావంతులకు ఏదో ఒకరోజున తారాపథం తివాచీ పరుస్తుంది అన్న మాటలు రంగనాథ్ విషయంలో నిజమయ్యాయని ఒప్పుకోక తప్పదు. రంగనాథ్ తన చుట్టూ ఉన్న సమస్యలకు నిరంతరం స్పందించేవారు. అదే ఆయనను కవిగా మార్చిందని చెప్పవచ్చు. చదువుకొనే రోజుల నుంచీ పలు అంశాలపై కవితలు రాసి, సన్నిహితులను అలరించారు. చదువుకొనే రోజుల్లోనే నాటకాలన్నా, వాటిలో నటించడమన్నా రంగనాథ్ కు ఎంతో ఆసక్తి. బి.ఏ. చదివిన రంగనాథ్ కొంతకాలం రైల్వేలో టికెట్ కలెక్టర్ గా పనిచేశారు. మిత్రుల ప్రోత్సాహంతో సినిమాల్లో ప్రయత్నాలు మొదలు పెట్టారు. కొన్ని చిత్రాలలో కనీకనిపించని పాత్రలు కూడా పోషించారు. 1974లో ‘చందన’ సినిమాతో రంగనాథ్ కు హీరోగా అవకాశం లభించింది.
Also Read
- World Science Day : సైన్స్ అంటే లాబ్స్, ఈక్వేషన్లే కాదు భయ్యా.. పీస్ అండ్ ప్లానెట్ ప్రొటెక్షన్
- Pawan Kalyan: అన్నా లెజినోవాతో విడాకులు ప్రకటించిన పవన్ కళ్యాణ్
- CM Revanth Reddy : కేటీఆర్‌పై రేవంత్ ఫైర్.. పది జన్మలెత్తినా కాలేవంటూ..
- PRASHAST : ప్రైవేట్ స్కూళ్లలో కొత్త స్క్రీనింగ్.. నిర్లక్ష్యం చేస్తే చర్యలు.!
రంగనాథ్ పూర్తి పేరు తిరుమల సుందర శ్రీరంగనాథ్. పేరుగా తగ్గట్టే సుందర రూపుడు. ఆరడగుల ఎత్తు. చూడగానే ఆకట్టుకొనే రూపం. ‘చందన’ సినిమాతో హీరో అయిన రంగనాథ్ ఆ తరువాత హీరో వేషాలే వేస్తానని భీష్మించుకోలేదు. తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేసుకుంటూ పోయారు. సింగీతం శ్రీనివాసరావు, రంగనాథ్ ను ప్రోత్సహించారని చెప్పాలి. తాను తెరకెక్కించిన “జమీందార్ గారి అమ్మాయి, అమెరికా అమ్మాయి, అందమె ఆనందం, పంతులమ్మ” వంటి చిత్రాలలో రంగనాథ్ కు హీరోగా అవకాశాలు కల్పించారు. ఈ చిత్రాలు రంగనాథ్ కు మంచి పేరు సంపాదించి పెట్టాయి. అలాగే “చదువు-సంస్కారం, సెక్రటరీ, లాయర్ విశ్వనాథ్, రామయ్య తండ్రి, రామచిలక, దేవతలారా దీవించండి, ఇంటింటి రామాయణం, తాయారమ్మ-బంగారయ్య, లవ్ ఇన్ సింగపూర్” వంటి చిత్రాలలో కథానాయకుడుగా, ఉప నాయకునిగా నటించి మెప్పించారు రంగనాథ్. హీరోగా అవకాశాలు తగ్గు ముఖం పట్టగానే కేరెక్టర్ రోల్స్ కు టర్న్ అయ్యారాయన. కేరెక్టర్ యాక్టర్ గా రంగనాథ్ నటించిన అనేక చిత్రాలు విజయపథంలో పయనించాయి. అనేక చిత్రాలలో పోలీస్ ఆఫీసర్ గా హుందాగా నటించి అలరించారు. వైవిధ్యం కోసం ‘గువ్వలజంట, రక్తాభిషేకం” వంటి చిత్రాలలో విలన్ గానూ కనిపించారు. అయితే సదరు చిత్రాలేవీ ఆయనకు అంతగా కలసి రాలేదు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి స్టార్ హీరోల చిత్రాలలో కేరెక్టర్ రోల్స్ లో రంగనాథ్ తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు.
కొన్ని టీవీ సీరియల్స్ లోనూ రంగనాథ్ నటించారు. కేరెక్టర్ యాక్టర్ గా రంగనాథ్ కు మంచి డిమాండ్ ఉన్న రోజుల్లోనూ ఆయన పారితోషికం విషయంలో ఏ నాడూ ఇంత ఇవ్వండి అని అడిగింది లేదు. నిర్మాత ఎంత ఇస్తే అంతే పుచ్చుకొనేవారు. మృదుభాషి అయిన రంగనాథ్ అంటే చిత్రసీమలో అందరికీ అభిమానమే. ఆయన భార్య ప్రమాదవశాన పక్షవాతానికి గురయినప్పుడు రంగనాథ్ ఆమెకు ఎంతగానో సపర్యలు చేశారు. రంగనాథ్ కు ఇద్దరు కూతుళ్ళు, ఓ అబ్బాయి. భార్య మరణం రంగనాథ్ ను కుంగదీసింది. ఏదో నటనలో పడి అలా అలా నెట్టుకు వచ్చారు. ఎందరిలోనో స్థైర్యం నింపిన రంగనాథ్, ఆత్మస్థైర్యం కోల్పోయారు. 2015లో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. రంగనాథ్ తన నటనతో ఆకట్టుకోవడమే కాదు, కవితలతో ఎందరినో అలరించారు. అలాంటి రంగనాథ్ ఆత్మహత్య చేసుకుంటారని ఎవరూ ఊహించలేదు. సున్నిత మనస్కుడైన రంగనాథ్ ను ఏదో బాధ అలా చేయడానికి దారి తీసి ఉంటుందని అభిమానులు, సన్నిహితులు భావించారు. ఏది ఏమైనా ఆయన హుందా నటనను జనం మరచిపోలేరు.
తాజావార్తలు
-
Nayanthara: క్రేజ్ ఉంది.. కానీ కలెక్షన్లు లేవు.! బాక్సాఫీస్ వద్ద నయనతారకు వరుస షాక్‌లు..
-
NCP: విలీనం దిశగా ఎన్సీపీ!?
-
Annapareddy Vijaya Bhaskar Reddy: వైసీపీకి మరో షాక్.. పార్టీకి సీనియర్ నేత అన్నపరెడ్డి గుడ్‌బై.. విజయసాయిరెడ్డి కొత్త పార్టీలో చేరుతా!
-
Karimnagar Drought: కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి.. రైతులకు నష్టపరిహారం చెల్లించాలి!
-
Rahul Gandhi Hyderabad Visit: హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ?.. భారత్ సమ్మిట్, గిగ్ వర్కర్లతో ప్రత్యేక సమావేశం!
ట్రెండింగ్
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?