భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భైరవం’. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది కథానాయికలు. ఈ సినిమాను మే 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు సినిమా టీం తెలిపింది. కాగా.. ప్రస్తుతం టీమ్ ప్రమోషన్లో భాగంగా బిజీగా మారింది. అందులో భాగంగానే ఓ వీడియోను విడుదల చేసింది.
Anurag Kashyap : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఇప్పుడు నటుడిగా మారిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసిన ఆయన.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో వరుస మూవీల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. ఆయన తాజాగా విజయ్ సేతుపతిపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేను కావాలని నటుడిగా మారలేదు. అనుకోకుండా అయ్యాను. సౌత్ లో నాకు చాలా సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. ముఖ్యంగా…
Pan India Movies : మన దేశంలో ప్రజలపై సినిమాల ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో మనకు తెలిసిందే. అది మంచి అయినా.. చెడు అయినా.. సినిమాలను చూసి టీనేజ్, యూత్ బాగా ఫాలో అవుతుంది. ఈ విషయం ఎన్నో సార్లు ప్రూవ్ అయింది. అలాంటప్పుడు టాలీవుడ్ నుంచి మెసేజ్ ఉన్న సినిమాలు రావాలని అంతా కోరుకుంటున్నా.. ఇప్పుడు అలాంటి సినిమాలే కరువయ్యాయి. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, చిరంజీవి, వెంకటేశ్,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ 'హరి హర వీరమల్లు'. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తొలి భాగం హరి హర వీరమల్లు పార్ట్ 1 : స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్, సాంగ్స్ తో ఈ మూవీపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. అయితే మొదటి భాగానికి సంబంధించి…
Venkatesh : విక్టరీ వెంకటేశ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. మొన్ననే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి హిట్ కొట్టాడు. దాని తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తారనే ప్రచారం ఉంది. అయితే తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నేను మొదటి నుంచి ఆధ్యాత్మికతను ఎక్కువగా పాటిస్తాను. తమిళ స్టార్ హీరో రజినీకాంత్ కూడా ఇలాగే ఆధ్యాత్మికతను ఎక్కువగా పాటిస్తుంటారు. నేను సినిమాల్లోకి వచ్చిన మొదట్లో రజినీకాంత్ తో ఎక్కువగా…
Betting Apps : తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రచారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు ఈ యాప్స్‌ను ప్రమోట్ చేయడం, వారి ఇమేజ్ను ఉపయోగించి ప్రజలను ఆకర్షించడం ఇప్పుడు చర్చకు దారితీసింది. ఈ వివాదంలో నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లు ప్రధాన పాత్ర పోషించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు చిత్రసీమలో అగ్రస్థానంలో ఉన్న బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లు ఇటీవల “Fun88” అనే బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేశారంటూ విమర్శలు…
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం తన కొత్త మూవీ ‘దిల్ రూబా’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కిరణ్ అబ్బవరం కెరీర్ లో ఇది 10వ సినిమా. దీనిని శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్ , ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తన నిర్మాణ సంస్థ ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మించాయి. నూతన దర్శకుడు విశ్వ కరుణ్ ఈ సినిమాను రూపొందించారు.
అన్ని కేసుల్లో బెయిల్స్ పోసాని కృష్ణ మురళికి సంబంధిత న్యాయస్థానాలు బెయిల్ ఇచ్చాయి. నిన్న నర్సారావుపేట కోర్టు, ఇవాళ ఆదోని, విజయవాడ కోర్టుల్లో పోసానికి బెయిల్స్ మంజూరు చేశాయి. అంతకుముందే రాజంపేట కోర్టు బెయిల్ ఇచ్చింది. పోసానిపై మొత్తంగా 17 కేసులు నమోదయ్యాయి. మహాశివరాత్రి రోజు, ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నమయ్య పోలీసుల అరెస్టు తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి.
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఇప్పటివరకు పేరు ఫిక్స్ చేయని ఈ సినిమాని SSMB 29 అని ప్రస్తావిస్తున్నారు. హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్లో ఒక షెడ్యూల్ షూట్ చేశారు. తదుపరి షెడ్యూల్ ఒరిస్సా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో ప్లాన్ చేశారు. ఇప్పటికే టీమ్ అంతా అక్కడికి చేరుకుంది. తాజాగా అక్కడ జరుగుతున్న ఒక సీన్ వీడియో కూడా లీక్ అయింది. దానిమీద టీం చర్యలు కూడా…
Trivikram: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ షాక్ ఇస్తున్నాడా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. పుష్ప-2తో భారీ హిట్ అందుకున్నాడు బన్నీ. దాని తర్వాత త్రివిక్రమ్ తో సినిమాను కన్ఫర్మ్ చేశాడు.