Upasana : మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లైఫ్, హెల్త్ కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ద ఖాస్ ఆద్మీ పేరుతో తన లైఫ్ కు సంబంధించిన విషయాలను పంచుకుంటోంది. తాజాగా డబ్బు, హోదా, జీవితం, విజయాలు, పొజీషన్, విలువల గురించి రాసుకొచ్చింది. ఈ సమాజం ఆడవారిని ఎప్పుడూ ఎంకరేజ్ చేయదు. అనకువతో ఉండాలనే చెబుతుంది. అంతేగానీ విజయాలు సాధించమని ప్రోత్సహించదు. నేను సాధించిన విజయాల వెనక నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది.
Read Also : Parineeti Chopra : తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్..
పెళ్లి వల్ల నాకు ఈ గౌరవం రాలేదు. రామ్ చరణ్ భార్యను కాబట్టి ఈ పొజీషన్ కు రాలేదు. దీని వెనకాల ఎంతో ఒత్తిడి, శ్రమ ఉన్నాయి. ఎన్నో సవాళ్లను దాటుకుని ఈ స్థాయిలో నిలబడ్డాను. అంతే తప్ప వారసత్వం, పెళ్లి వల్ల కాదు. ఎవరైనా లైఫ్ లో ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు ఉన్న లగ్జరీని పక్కన పెట్టి కష్టపడాలి. సవాళ్లను ఎదుర్కోవాల్సిందే. అది వాళ్లను మరింత రాటుదేలేలా చేస్తుంది అంటూ చెప్పుకొచ్చింది ఉపాసన. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఉపాసన ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ కు వైస్ చైర్మన్ గా ఉన్న సంగతి తెలిసిందే.
Read Also : Bigg Boss : గుండు గీయించుకోవడం.. పేడ రాసుకోవడం.. ఏంటీ పిచ్చి టాస్కులు..