CM Revanth Rddy : టాలీవుడ్ లో కొత్త పాలసీ తీసుకువస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా సీఎం రేవంత్ ను టాలీవుడ్ నిర్మాతలు, డైరెక్టర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. సినీ కార్మికుల సమ్మె ముగింపు కోసం చొరవ చూపినందుకు రేవంత్ కు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలో పని వాతావరణం బాగా ఉండాలి. సినిమా కార్మికులను కూడా పిలిచి మాట్లాడుతా. టాలీవుడ్ కు ప్రభుత్వం నుంచి సినిమా పరిశ్రమ కు పూర్తి సహకారం అందించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే వారికి స్కిల్స్ పెంచేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. వివిధ అంశాల్లో స్కిల్స్ పెంపు కోసం ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్నారు రేవంత్.
Read Also : Actors Re-Union : శ్రీకాంత్, అలీ బ్యాచ్ రీ యూనియన్.. ఫొటోలు వైరల్
స్కిల్ యూనివర్సిటీలో సినిమా పరిశ్రమ కోసం కావాల్సిన ఏర్పాట్లు తీసుకుంటామని హామీ ఇచ్చారు రేవంత్. తెలుగు సినిమాలు అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్తున్నాయని.. తెలంగాణ సినీ పరిశ్రమ తమకు ఎంతో ముఖ్యం అన్నారు రేవంత్. ఇండస్ట్రీలో ఈ వివాదాలు ఉండొద్దనే ఉద్దేశంతోనే చొరవ చూపించాను. అందరూ కలిసి ముందుకు వెళ్లాలి. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వం కలిసి ఒక పాలసీ తీసుకువస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాం. త్వరలోనే దాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తాం. పరిశ్రమకు ఏం కావాలో తెలుసుకుని అవన్నీ చేద్దాం. ఇండస్ట్రీలో వ్యవస్థలను నియంత్రించాలని చూస్తే ప్రభుత్వం సహించదు. అందరూ చట్ట పరిధిలో పని చేయాల్సిందే. నేను టాలీవుడ్ విషయంలో న్యూట్రల్ గానే ఉంటాను. ఎవరికీ అన్యాయం జరగొద్దు అన్నారు సీఎం రేవంత్.