పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరి 25 న రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలను మేకర్స్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్లాష్ బ్యాక్ ఆయువు పట్టుగా నిలవనున్నదట.. పవన్ కళ్యాణ్ మాస్ యాంగిల్ ని ఇందులో చూపించనున్నారట దర్శకుడు.
ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఫైట్ సీన్స్ అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయమంటున్నారు. ఈ షూట్ కిసంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టినట్ వైరల్ గా మారాయి. పవన్ కళ్యాణ్ తో ఆ సీన్ లో పాల్గున్న విలన్స్, మరికొంతమంది అమ్మాయిలు ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అవి కాస్తా ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రం సినిమాలో అదిరిపోతోంది తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తుండగా.. పవన్ సరసన నిత్యా మీనన్ నటిస్తుంది. మరి వచ్చే నెల భీమ్లా నాయక్ పూనకాల జాతర ఏ విధంగా ఉండబోతుందో చూడాలి.