ఆరేళ్ళ క్రితం ఇదే సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్నినాయనా’ అంటూ వచ్చి వినోదం పంచేసి, ఎంచక్కా హిట్టు పట్టేశాడు బంగార్రాజు. ఇప్పుడు ‘బంగార్రాజు’గానే జనం ముందు నిలచి మళ్ళీ సంక్రాంతికే సందడి చేసే ప్రయత్నం చేశాడు. ఈ సారి తానొక్కడే కాదు, తనయుడు నాగచైతన్యనూ కలుపుకొని సంక్రాంతి సంబరాల్లో సందడి మరింత పెంచడానికి సిద్ధమయ్యాడు నాగార్జున. అందుకు తగ్గట్టుగానే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల ‘బంగార్రాజు’ను తెరపై నిలిపారు.
అప్పుడంటే బంగార్రాజు ఆత్మ వచ్చి, తనయుడిలో ప్రవేశించి, తెగ సందడి చేసేసి జనాన్ని మురిపించింది. మరి ఇప్పుడు ‘బంగార్రాజు’ ఏం చేశాడన్నదే ఈ సీక్వెల్. ఇది బంగార్రాజు కొడుకు రామ్మోహన్ తనయుడు చిన్న బంగార్రాజు కథ. భార్య సీత మరణంతో తన కొడుకును తల్లి చేతిలో పెట్టి, అమెరికా వెళ్ళిపోతాడు రామ్మోహన్. నాన్నమ్మ దగ్గరే పెరిగిన చిన బంగార్రాజు సైతం తాత పోలికలతో ఊరిలో అమ్మాయిలతో సందడి చేస్తూ ఉంటాడు. అతన్ని ఆ ఊరి సర్పంచ్ కూతురు నాగలక్ష్మికి ఇచ్చి పెళ్ళి చేయాలని సత్తెమ్మ భావిస్తుంది. ఇలాంటి టైమ్ లో మనవడి ఘనకార్యం ఒకటి చూసి ఆమె హఠాన్మరణం చెందుతుంది. మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే చిన్న బంగార్రాజుకు, నాగలక్ష్మీతో పెళ్ళి జరిగితే లోక కళ్యాణం అని విధాత భావిస్తాడు. దాంతో బంగార్రాజు, అతని భార్య సత్తెమ్మ ఆత్మలను యమధర్మరాజు, ఇంద్రుడు కలిసి భూలోకానికి పంపుతారు. ఆ తర్వాత వీరిద్దరూ కథను ఎలా రక్తి కట్టించారన్నదే ఈ సినిమా. మధ్యలో కొన్ని ట్విస్టులు వచ్చినా, వాటిలోనూ వినోదమే కనిపిస్తుంది.
‘సోగ్గాడే చిన్నినాయనా’కు సీక్వెల్ గా తెరకెక్కిన ‘బంగార్రాజు’లో అసలు సందడి నాగార్జునదే అని చెప్పొచ్చు. ఆరేళ్ళ క్రితం ఏ తీరున తెరపై కనిపించారో, ఇప్పుడూ నాగ్ అదే ఫిజిక్ మెయింటెయిన్ చేయడం విశేషం. ఇక అందం మందమైనా, ఇప్పటికీ ఆకర్షణీయంగానే ఉన్న రమ్యకృష్ణ సైతం అదే తీరున మురిపించారు. నాగ్, రమ్యకృష్ణ తమ పాత పాత్రల్లోనే ఇట్టే వినోదం పంచగా, నాగచైతన్యకు ఈ తరహా పాత్ర కొత్తదే. కానీ, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, ఆయన నుండి తనకు కావలసిన నటనను రాబట్టడంలో సక్సెస్ అయ్యారు. ‘ఉప్పెన, శ్యామ్ సింగరాయ్’ చిత్రాల్లో అందంతో బంధం వేసిన కృతి శెట్టి, ఈ సారి ఆ బంధాలతో పాటు హాస్యాన్ని సైతం తాను పండించగలనని నిరూపించింది. ఆమె పోషించిన నాగలక్ష్మి పాత్ర జనాన్ని ఇట్టే ఆకట్టుకుంటుంది. రావు రమేశ్, బ్రహ్మాజీ, సంపత్ రాజ్, గోవింద్ పద్మసూర్య, రోహిణి, వెన్నెల కిశోర్, ఝాన్సీ, అనితా చౌదరి తమ పాత్రలకు తగ్గ అభినయం ప్రదర్శించారు. స్వర్గలోక సుందరీమణులుగా సీరత్ కపూర్, మీనాక్షి దీక్షిత్, వేదిక, దర్శనా బానిక్ అందాల విందు చేశారు. అలానే ‘లడ్డుండా’ పాటలోనే నాగ చైతన్య సరసన దక్షా నగార్కర్ తన డాన్స్ తో మెప్పించింది. ‘జాతిరత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా సైతం క్లయిమాక్స్ లో వచ్చే ఐటమ్ సాంగ్ తో ఆకట్టుకుంది.
ఇప్పటికే బంగార్రాజు
పాటలు జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా భాస్కరభట్ల రాసిన లడ్డుండా...
పాట వినడానికే కాదు, అందుకు తగ్గ పిక్చరైజేషన్ తోనూ మురిపించింది. మిగిలిన పాటల్లో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ పలికించిన వాసివాడి తస్సాదియ్యా...
కూడా మాస్ ను ఆకట్టుకునేలా సాగింది. డ్యుయట్ బంగారా...
కూడా అలరిస్తుంది. అనూప్ రూబెన్స్ తన పరిధి మేరకు వినసొంపైన సంగీతం అందించడానికే కృషి చేశారు. జె.యువరాజ్ కెమెరా పనితనం కోనసీమ పచ్చని అందాల నడుమ యువ జంట నాగచైతన్య, కృతి శెట్టిని మరింత అందంగా చూపించే ప్రయత్నం చేసింది. సెకండాఫ్ ప్రారంభం సో సోగా వున్న క్లైమాక్స్ ఆకట్టుకుంది. ముఖ్యంగా బంగార్రాజు ఆత్మ ఇటు కొడుకు రామ్మోహన్ లోకి, అటు మనవడు చిన్న బంగార్రాజులోకి వెళ్ళి చేసే ఫైట్స్ అక్కినేని అభిమానులతో విజిల్స్ వేయిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మొత్తానికి బంగార్రాజు
ఈ సంక్రాంతి సందడిలో తన సంబరాలతో హంగామా చేస్తాడే అనిపిస్తోంది. అఖండ
ఘనవిజయం తరువాత నుంచి కరోనాను సైతం లెక్క చేయకుండా జనం స్టార్ హీరోస్ సినిమాలను ఆదరిస్తున్నారు. అదే తీరున బంగార్రాజు
కూ ఆదరణ లభిస్తుందేమో!
ప్లస్ పాయింట్స్:
మైనస్ పాయింట్స్:
సోగ్గాడే...
కంటే భిన్నమైన కథనం లేకపోవడంరేటింగ్: 2.75 / 5
ట్యాగ్ లైన్: సంబరాల సోగ్గాళ్ళు!