40 ఏళ్ళ ‘బంగారుభూమి’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో కృష్ణ, డైరెక్టర్ పి.చంద్రశేఖర్ రెడ్డి కాంబినేషన్ లో పలు జనరంజకమైన చిత్రాలు తెరకెక్కాయి. వారిద్దరి కలయికలో రూపొందిన పల్లెసీమల నేపథ్యం ఉన్న సినిమాలు విజయాలు సాధించాయి. కృష్ణను సంక్రాంతి హీరోగా నిలిపిన ఘనత కూడా చంద్రశేఖర్ రెడ్డిదే! కృష్ణ హీరోగా పి.సి.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘పాడిపంటలు’ చిత్రం విజయం సాధించింది. అప్పటి నుంచీ ప్రతి సంక్రాంతికి కృష్ణ ఓ సినిమాను విడుదల చేస్తూ వచ్చారు. అలా కృష్ణ, పి.సి.రెడ్డి కాంబినేషన్ లో రూపొందిన ‘బంగారుభూమి’ కూడా సంక్రాంతి కానుకగా 1982 జనవరి 14న జనం ముందు నిలచింది. శ్రీదేవి నాయికగా నటించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని మహేశ్వరి మూవీస్ పతాకంపై ఎస్.పి.వెంకన్న బాబు నిర్మించారు.
‘బంగారుభూమి’ కథ విషయానికి వస్తే – రవి తన సవతితల్లి, చెల్లి, తమ్ముడుతో కలసి జీవిస్తూ ఉంటాడు. భూమే తల్లిగా భావిస్తూంటాడు. అతని ఎదుగుదల చూసి ఊరిలో పెద్దమనుషులకు కన్నుకుడుతుంది. రవికి, సవతి తమ్మునికి మధ్య పుల్లలు పెడతారు. వారు విడిపోతారు. ఆ ఊరిలో అందరివాడుగా ఉన్న షావుకారు ఊరి జనానికి అప్పులు ఇచ్చి, ఆస్తి మొత్తం పోగొట్టుకొని ఉంటాడు. అతని కూతురు పద్మ ధనగర్వంతో ఉంటుంది. ఆమెకు రవి కనువిప్పు కలిగిస్తాడు. షావుకారు కోరికపై పద్మను రవి పెళ్ళాడుతాడు. తన వాటాకు వచ్చిన భూమిలోనే బంగారు పండిస్తాడు రవి. చివరకు రవి తమ్ముడు సుధాకర్ కు అసలు విషయం తెలుస్తుంది. అతణ్ణి హింసించే సమయంలో రవి వెళ్ళి కాపాడి, అసలు దోషులను పోలీసులకు పట్టిస్తాడు. అందరూ కలుసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.
Also Read
- Karthi-Suriya: కార్తీ, సూర్య.. వెయిట్ చేస్తూనే ఉంటారా?, హోప్స్ వదిలేసుకుంటారా?
- Ramayana Movie Piracy: 'రామాయణ: పార్ట్ 1' మూవీ పైరసీ.. ఇక థియేటర్లలో వీడియోలు రికార్డ్ చేస్తే క్రిమినల్ కేసే..!
- Allu Arjun: అల్లు అర్జున్‌కు తప్పనున్న తిప్పలు!
- Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
‘బంగారుభూమి’ చిత్రంలో కృష్ణ, రావు గోపాలరావు, శ్రీదేవి, గుమ్మడి, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, కృష్ణకుమారి, గిరిబాబు, ప్రభాకర్ రెడ్డి, సుధాకర్, సూర్యకాంతం, రాజబాబు, కవిత, సుభాషిణి, సంగీత, గీత, మిక్కిలినేని, నిర్మలమ్మ, హరనాథ్ నటించారు. ఈ చిత్రానికి మోదుకూరి జాన్సన్, అప్పలాచార్య మాటలు రాశారు. ఆత్రేయ, వేటూరి పాటలు పలికించగా, జె.వి.రాఘవులు స్వరకల్పన చేశారు. “దొంగ చిక్కంది…”, “ఆరిపేయ్ ఆరిపేయ్ చలిమంట…”, “పొంగింది పొంగింది బంగారుభూమి…” పాటలు అలరించాయి. 1982 సంక్రాంతి సంబరాల్లో విజయం సాధించిన చిత్రాలలో ఒకటిగా ‘బంగారుభూమి’ నిలచింది.
తాజావార్తలు
-
Seattle Diwali Celebrations: పండుగ వేళ విద్వేషం.. అమెరికాలో దీపావళి వేడుకలను అడ్డుకునేందుకు యత్నం!
-
Diwali Special Trading: దీపావళి వేళ మార్కెట్ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..
-
KL Rahul: పెద్ద ఆటగాడు.. అంతకంటే పెద్ద మనసు.. ఇది నిజమైన కేఎల్ క్లాస్!
-
IPL 2027 Retentions: రూ.20 కోట్ల ఆటగాళ్లకు ఉద్వాసన.. ఇక పక్కకెళ్లి ఆడుకోండమ్మా!
-
CM Revanth Reddy 57th Birthday: సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని మోడీ, స్పీకర్ ఓం బిర్లా శుభాకాంక్షలు..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!