అక్కినేని నాగార్జున, నాగ చైతన్య మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్లో నాగ చైతన్య, హీరోయిన్ దక్ష నగార్కర్ వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతుండగా చై వెనక్కి తిరిగినప్పుడు దక్ష కనుబొమ్మలు ఎగురవేయడం, అందుకు చై సిగ్గు పడడం.. ఈ క్యూట్ వీడియో అప్పట్లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ వీడియోపై ఎన్నో మీమ్స్ కూడా వచ్చాయి. అక్కినేని హీరో సైట్ కొడుతున్నాడని, దక్ష అక్కినేని కోడలిగా ట్రై చేస్తుందని ఇలా రూమర్స్ గుప్పుమన్నాయి. ఇక ఈ క్రమంలో ఈ వీడియోపై డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ స్పందించాడు.
బంగార్రాజు సక్సెస్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .” ఆరోజు జరిగినదాంట్లో చై తప్పేమి లేదు.. మొదటి నుంచి చై మొహమాటస్తుడు.. బహు సిగ్గరి అని అందరికి తెలిసిందే. ఆరోజు కూడా వెనక ఏదో సౌండ్ వస్తే వెనక్కి తిరిగాడు. అప్పుడే దక్ష ఏంటీ అని కళ్ళు ఎగరేసింది. దానికి చై సిగ్గుపడుతూ మాట్లాడకుండా ఇటు తిరిగేశాడు. అంతా దక్ష వలనే జరిగింది చైతన్యది ఏం లేదు, అంతా నువ్వే చేశావు’ అంటూ హీరోయిన్ వైపు చూస్తూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా చైతన్య క్యారెక్టర్ ని 24 క్యారెట్స్ బంగారంతో పోల్చాడు. చైతూ బంగారం .. ఇది అతనితో పనిచేశాక తెలిసింది. రారండోయ్ వేడుక చూద్దాం చిత్రం చేసినప్పుడు 24 క్యారెట్స్ అయితే బంగార్రాజుతో 48 క్యారెట్స్ గా మారాడు అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.