Laya Gorty: స్వయంవరం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన తెలుగమ్మాయి లయ. మొదటి సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఆమె.. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయిపోయింది.
Laya:అందాల అభినేత్రి లయను చూడగానే మన పక్కింటి అమ్మాయే అనిపిస్తుంది. అనేక చిత్రాలలో సంప్రదాయబద్ధంగా నటించి మెప్పించారు లయ. బాలనటిగానే భళా అనిపించారు లయ. జయసుధ, విజయశాంతి తరువాత వరుసగా రెండు సంవత్సరాలు ఉత్తమనటిగా నంది అవార్డులు అందుకున్న నాయికగా నిలిచారామె. ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజెలిస్ లో ఉంటున్న లయ, తన దరికి చేరిన పాత్రల్లో నటించడానికి ఇప్పటికీ ఆసక్తి చూపిస్తున్నారు.