Laya: అభినయ ‘లయ’ విన్యాసాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Laya:అందాల అభినేత్రి లయను చూడగానే మన పక్కింటి అమ్మాయే అనిపిస్తుంది. అనేక చిత్రాలలో సంప్రదాయబద్ధంగా నటించి మెప్పించారు లయ. బాలనటిగానే భళా అనిపించారు లయ. జయసుధ, విజయశాంతి తరువాత వరుసగా రెండు సంవత్సరాలు ఉత్తమనటిగా నంది అవార్డులు అందుకున్న నాయికగా నిలిచారామె. ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజెలిస్ లో ఉంటున్న లయ, తన దరికి చేరిన పాత్రల్లో నటించడానికి ఇప్పటికీ ఆసక్తి చూపిస్తున్నారు.
లయ పదహారు అణాల తెలుగమ్మాయి. 1981 అక్టోబర్ 21న లయ విజయవాడలో జన్మించారు. ఆమె తల్లి సంగీతం టీచర్. తండ్రి డాక్టర్. విజయవాడలో తన తల్లి పనిచేస్తున్న నిర్మల హైస్కూల్ లో లయ చదువు సాగింది. చెస్ లో మంచి ప్రావీణ్యం సంపాదించింది లయ. చదువుకొనే రోజుల్లోనే ఏడు సార్లు స్టేట్ చెస్ ఛాంపియన్ గానూ, ఓ సారి నేషనల్ లెవెల్ లో సెకండ్ ప్లేస్ లోనూ నిలిచారు లయ. డాన్స్ లోనూ ప్రావీణ్యం గడించిన లయ దాదాపు 50 నృత్యప్రదర్శనలు ఇచ్చారు. 1999లో తెరకెక్కిన ‘స్వయంవరం’ చిత్రంతో లయ నాయికగా పరిచయం అయ్యారు. వేణు హీరోగా రూపొందిన ఈ చిత్రం ఆయనకు, లయకు మంచి పేరు సంపాదించి పెట్టింది. “మా బాలాజీ, మనోహరం, దేవుల్ళు, రామ్మా చిలకమ్మా, హనుమాన్ జంక్షన్, ప్రేమించు, శివరామరాజు, నీ ప్రేమకై, మిస్సమ్మ, టాటా బిర్లా మధ్యలో లైలా, విజయేంద్రవర్మ” వంటి చిత్రాలలో లయ నటించి ఆకట్టుకున్నారు. కొన్ని కన్నడ, మళయాళ, తమిళ చిత్రాలలోనూ లయ అభినయించారు. 2000లో ‘మనోహరం’ చిత్రం ద్వారా, 2001లో ‘ప్రేమించు’తోనూ ఉత్తమ నటిగా నంది అవార్డును అందుకున్నారు లయ.
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
లయ ఓ వైపు నటిస్తూనే, మరోవైపు తన చదువు సాగించారు. కంప్యూటర్స్ అప్లికేషన్స్ లో బ్యాచ్ లర్ డిగ్రీ చేశారు. 2006లో శ్రీగణేశ్ గొర్తిని పెళ్ళాడారు లయ. వారికి ఓ బాబు, ఓ పాప ఉన్నారు. అమెరికాలో తన చదువుకు తగ్గ ఉద్యోగం చేస్తూసాగారు లయ. అప్పుడప్పుడూ అవకాశాలు వస్తే మాత్రం వదలకుండా మళ్ళీ కెమెరా ముందుకు వచ్చి నటించారు. 2018లో రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’లో లయ నటించారు. మళ్ళీ ఏ చిత్రంతో లయ ప్రేక్షకులను పలకరిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..