Toll fee: టోల్ ఫీజు ఎగ్గొట్టడానికి ఓ బస్సు డ్రైవర్ దారుణానికి పాల్పడ్డాడు. టోల్ ప్లాజాలో ఆపకుండా వేగంగా బస్సుని నడిపాడు. బస్సుని అడ్డుకునేందుకు ప్రయత్నించిన టోల్ సిబ్బందిలో ఒకరిని బస్సుతో తొక్కించాడు. దీనికి సంబంధించిన విజువల్స్ అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లోని ఘమ్రోజ్ ప్లాజా వద్ద జరిగింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే హర్యానా రోడ్ వేస్ బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Read Also:…
సంక్రాంతి పండుగ సంబరాలు పల్లెల్లో అంబరాన్ని తాకాయి.. మూడు రోజుల పాటు ఘనంగా జరిగిన భోగి, సంక్రాంతి, కనుమ పండగ ముగియడంతో.. తిరిగి పట్నం బాట పట్టారు జనం.. పండగకు ముందు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే రహదారులు.. ముఖ్యంగా విజయవాడ హైవే రద్దీగా మారి.. ఎక్కడి కక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ కాగా.. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.. పల్లెకు బైబై చెబుతూ పట్నం బాట పట్టారు..
ఇకపై టోల్ గేట్ దగ్గర ఆగక్కర లేదు. టోల్ గేట్ దగ్గర ఆగకుండా ఉండేలా కొత్త టోల్ వ్యవస్థ త్వరలో రాబోతోంది. ఇందుకు సంబంధించి కొత్త టోల్ వ్యవస్థను రూపొందిస్తున్నారు.
Toll Gate: కర్ణాటకలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున విధుల్లో ఉన్న టోల్ గేట్ ఆపరేటర్ గేటు తీయడం ఆలస్యమైందంటూ అతనిపై (26) కొందరు యువకులు దాడి చేశారు. ఈ ఘటనలో టోల్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి.
ఈ మధ్య కాలంలో టోల్‌గేట్ల దగ్గర గొడవలు పెరిగిపోతున్నాయి. టోల్‌గేట్ దగ్గర పేమెంట్ చేసే సమయంలో కొంత ఆలస్యం అవుతుండటంతో ప్రయాణీకులు ఓపిక లేకుండా టోల్ సిబ్బందిపై దాడులకు దిగుతున్నారు.
సంక్రాంతి సెలవులు ముగియడంతో ప్రజలు పల్లెల నుంచి పట్నం బాట పట్టారు. దీంతో స్వగ్రామాల నుంచి ప్రజలు హైదరాబాద్‌కు పయనం అయ్యారు. సోమవారం నుంచి ఆఫీసులు తెరుచుకోవడంతో ఉద్యోగులు సొంతూళ్ల నుంచి హైదరాబాద్ వస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. Read Also: పశువుల పండగలో విషాదం.. పొట్టేలుకు బదులు మనిషి బలి సాధారణ రోజుల్లో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వచ్చే వాహనాల రాకపోకలు సోమవారం రెట్టింపు స్థాయిలో ఉన్నాయని…
విశాఖజిల్లాలో టోల్ ప్లాజా సిబ్బందిపై వైసీపీ నేతల దాడి కలకలం రేపింది. పాయకరావుపేటకు చెందిన మండల స్థాయి నాయకులు.. నక్కపల్లి మండలం వేంపాడు టోల్ గేట్ దగ్గర ఫీజు చెల్లించకుండా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో డ్యూటీలో ఉన్న ఉద్యోగి సత్యన్నారాయణ కారును అడ్డుకున్నారు. ఫీజ్ కట్టి వెళ్లాల్సినదేనని పట్టుబట్టారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇతర సిబ్బంది కూడా అక్కడకు చేరుకోవడంతో మాటమాట పెరిగి చివరకు గొడవకు దారి తీసింది.తమనే అడ్డుకుంటావా అంటూ అధికార పార్టీ…