టొక్యో పారాలింపిక్స్ విజేతలకు టాలీవుడ్ సినీప్రముఖులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ లు ఇప్పటికే విజేతల ప్రతిభను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేయగా.. తాజాగా నందమూరి బాలకృష్ణ ‘ప్రతిభకు అంగవైకల్యం అడ్డుకాదు అని నిరూపించిన మీ అందరిని చూసి నేను చాలా గర్వపడుతున్నాను’ అంటూ అభినందనలు తెలియచేశారు. ‘ టొక్యో పారాలింపిక్స్ లో పాల్గొన్న ప్రతి ఒక్క భారత క్రీడాకారులకు, విజేతలకు నా అభినందనలు, అంగవైకల్యాన్ని అధిగమించి తమ ప్రతిభ, పట్టుదల, ఆత్మవిశ్వాసాలతో…
టోక్యో పారాలింపిక్స్‌లో జన్మాష్టమి సందర్భంగా భారతదేశం తన జెండాను ఎగురవేసింది. నేడు అథ్లెట్లు కొన్ని గంటల్లో 4 పతకాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. టోక్యో పారాలింపిక్స్‌లో 2 గంటల్లో 1 స్వర్ణం, 2 రజతాలు, 1 కాంస్య పతకం సాధించిన ఇండియా అథ్లెట్లు చరిత్ర సృష్టించారు. మన దేశం నుంచి అవ్ని లేఖరా ‘షూటింగ్’లో బంగారు పతకం సాధించింది. ‘త్రో డిస్క్’లో యోగేశ్ కథునియా రజత పతకం సాధించారు. ‘జావెలిన్’లో భారతదేశం రజత, కాంస్య పతకాలను గెలుచుకుంది.…