పారాలింపిక్స్ లో భారత్ ఖాతాలోకి మరో స్వర్ణం వచ్చి చేరింది. తాజాగా పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ SH6 విభాగంలో కృష్ణ గోల్డ్ గెలిచాడు. సెమిస్ లో అద్భుతమైన ప్రదర్శన చేసి ఫైనల్స్ కు చేరుకున్న కృష్ణ ఇక్కడ అదే జోరు చూపించాడు. ఫైనల్స్ లో హాంకాంగ్ ప్లేయర్ పైన మొదటి రౌండ్ ను 21-17 సొంతం చేసుకున్న కృష్ణ రెండో రౌండ్ ను 16-21 తో కోల్పోయాడు. కానీ చివరిదైన మూడో రౌండ్ లో మళ్ళీ పుంజుకొని…
పారాలింపిక్స్ లో భారత్ కు వరుస పతకాలు వస్తున్న వస్తున్న విషయం తెలిసిందే. నిన్న ఒక్క రోజే నాలుగు పతకాలు సాధించిన భారత అథ్లెట్లు ఈ రోజు కూడా పతకాల వేటను ప్రారంభించారు. పారా బ్యాడ్మింటన్ ఇండియా ప్లేయర్ సుహాస్ యతిరాజ్ రజతం సాధించాడు. సెమిస్ లో అద్భుత ప్రదర్శన చేసి సుహాస్ ఫైనల్స్ కు చేరుకున్నాడు. అయితే ఫైనల్ లో దూకుడుగా వ్యవరించి మొదటి రౌండ్ ను సొంతం చేసుకున్న సుహాస్ ఆ తర్వాతి రెండు…
జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారా ఒలింపిక్స్ నేటితో ముగియనున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి మనదేశ క్రీడాకారులు దుమ్మురేపారు. ఏకంగా పదిహేడు పతకాలు సాధించారు. పారా ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులపై.. దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. టోక్యో పారా ఒలింపిక్స్.. భారత క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు. నాలుగు స్వర్ణాలు, ఏడు రజతాలు, ఆరు కాంస్యాలు కలిపి ఏకంగా మన క్రీడాకారులు.. 17 పతకాలు సాధించారు. ఆగస్టు 24న ప్రారంభమైన ఈ పారా…
పారాలింపిక్స్ 2020 లో భారత అథ్లెట్లు తమ జోరును కొనసాగిస్తున్నారు. తాజాగా మిక్సిడ్50 మీ పిస్టల్ షూటింగ్ లో భారత షూటర్లు మనీష్, సింగ్‌రాజ్ రెండు పతకాలు సాధించారు. ఈ విభాగంలో మొత్తం 218.2 పాయింట్లతో కొత్త పారాలింపిక్ రికార్డు సృష్టించి షూటర్ మనీష్ స్వర్ణం గెలిచాడు. అలాగే మరో షూటర్ సింగ్‌రాజ్ 216.7 పాయింట్లతో రజత పతకాన్ని అందుకున్నాడు. అయితే ఇప్పటికే పారాలింపిక్స్ 2020 లో 2 స్వర్ణ పతకాలు, 6 రజతం, 5 కాంస్యలతో…
పారా ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. పతకాలు కొల్లగొడుతూనే ఉన్నారు. అవని లేఖరా… ఒకే పారా ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించారు. పతకాల పట్టికలో ఇండియా 37వ స్థానంలో నిలిచింది. మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…ఈ నెల 9న పారా ఒలింపియన్లను కలుసుకోనున్నారు. భారత దేశ బంగారు బాలిక అవని లేఖారా సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళా పారాలింపియన్‌గా…
టోక్యో వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్‌లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది… ఇవాళ భారత్ ఖాతాలో మరో పతకం చేరింది… టీ64 పురుషుల హై జంప్‌లో ప్రవీణ్ కుమార్ రజత పతకాన్ని సాధించాడు. 2.07 మీటర్ల జంప్‌తో ఈ పతకాన్ని సాధించాడు ప్రవీణ్ కుమార్.. ఇక, 18 ఏళ్లకే పతకాన్ని అందుకున్న ప్రవీణ్.. సరికొత్త ఆసియన్ రికార్డు నెలకొల్పాడు. తాజాగా పతకంతో పారాలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 11కు చేరింది.
టోక్యో పారాలింపిక్స్‌లో జన్మాష్టమి సందర్భంగా భారతదేశం తన జెండాను ఎగురవేసింది. నేడు అథ్లెట్లు కొన్ని గంటల్లో 4 పతకాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. టోక్యో పారాలింపిక్స్‌లో 2 గంటల్లో 1 స్వర్ణం, 2 రజతాలు, 1 కాంస్య పతకం సాధించిన ఇండియా అథ్లెట్లు చరిత్ర సృష్టించారు. మన దేశం నుంచి అవ్ని లేఖరా ‘షూటింగ్’లో బంగారు పతకం సాధించింది. ‘త్రో డిస్క్’లో యోగేశ్ కథునియా రజత పతకం సాధించారు. ‘జావెలిన్’లో భారతదేశం రజత, కాంస్య పతకాలను గెలుచుకుంది.…
పారాలింపిక్స్ 2020 లో తాజాగా భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. పురుషుల డిస్క్ త్రో లో రజత పతకం సాధించాడు భారత అథ్లెట్ యోగేష్. 44.38 మీటర్ల దూరం డిస్క్ ను విసిరి ఈ సిల్వర్ ను సొంతం చేసుకున్నాడు యోగేష్. అయితే మొదటి స్థానంలో బ్రెజిల్ కు చెందిన అథ్లెట్ 45.59 మీటర్ల దూరం డిస్క్ ను విసిరి స్వర్ణం సాధించాడు. ఇక భారత్ కు ఇప్పటికే ఒక్క గోల్డ్, రెండు సిల్వర్,…
టోక్యో పారాలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో రజత పతకం వచ్చి చేరింది. హైజంప్ లో అథ్లెట్ నిషాద్ కుమార్ ఈ పతకాన్ని సాధించారు. ఈ పతకం సాధించే సమయంలో 2.06 మీటర్లతో నిషాద్ కుమార్ ఆసియా గేమ్స్ రికార్డు ను బ్రేక్ చేసాడు. అయితే ఈ హైజంప్ లో యూఎస్ అథ్లెట్ 2.15 స్వర్ణం కైవసం చేసుకున్నాడు. అయితే రజతం సాధించిన నిషాద్ కుమార్ కు ట్విట్టర్ వేదికగా ప్రధాని మొదటి శుభాకాంక్షలు తెలిపారు. అయితే…