టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియా బాక్సర్ లవ్లినా బొర్గోహెన్ తన సత్తా చాటింది. తన కంటే బలమైన ప్రత్యర్థులను చిత్తు చేస్తూ క్వార్టర్స్ వరకు దూసుకొచ్చిన లవ్లినా.. కీలక మైన క్వార్టర్ ఫైనల్లోనూ దుమ్ములేపింది. చైనీస్ తైపీ బాక్సర్ అయిన చెన్ నైన్ చిన్‌పై అద్భుత విజయాన్ని దక్కించుకుంది. దీంతో ఇండియాకు టోక్యో ఒలింపిక్స్‌లో మరో పతకం ఖరారు అయింది. సెమీస్ లో ఓడినా.. లవ్లికాకు పతకం కచ్చితంగా రానుంది. కాబట్టి ఆమె ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా…
ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు దూసుకుపోతోంది. పూల్ -ఏ మూడో మ్యాచ్ లో 3-0 తేడాతో స్పెయిన్ పై ఘన విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచి భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి క్వార్టర్ లోనే అద్భుత ప్రదర్శనతో రెండు గోల్స్ చేసి.. మ్యాచ్‌ను తన చేతుల్లోకి తీసుకుంది ఇండియా. నాలుగో క్వార్టర్ లో మూడో గోల్ చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. రూపిందర్ పాల్ రెండు గోల్స్ తో సత్తా చాటగా… 14…
కట్టెలు ఎత్తిన చేతులతోనే భారత్‌కు వెండి పతకాన్ని సాధించి పెట్టారు వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను.. టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించి.. భారత్ పతకాల ఖాతా తెరిచారామె.. ఇక, ఆమెకు బంగారం పతకం కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి.. కానీ, బంగారు పతకాన్ని అందుకున్న చైనీ క్రీడాకారిణి డోపింగ్ టెస్ట్‌లో విఫలం అయితేనే అదిసాధ్యం అవుతుంది. మరోవైపు.. ఇప్పటికే స్వదేశానికి చేరుకున్న చానుకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది.. ఇక, ఇటీవల ఆమెకు కోటి రూపాయల…
టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి.. భారత్‌ను శుభారంభాన్ని అందించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు గోల్డ్ మెడల్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి… 49 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో ఆమె సిల్వర్ మెడల్ గెలుచుకోగా.. ఈ ఈవెంట్‌లో చైనా వెయిట్‌లిఫ్టర్ ఝిహుయి హౌ గోల్డ్ గెలిచింది. కానీ, ఆమెకు యాంటీ డోపింగ్ పరీక్షలు చేసేందుకు సిద్ధమయ్యారు అధికారులు.. ఇప్పటికే మీరాబాయి చాను.. టోక్యో నుంచి భారత్‌కు చేరుకోగా… టోక్యోలోనే ఉండాల్సిందిగా హౌను ఆదేశించారు ఒలింపిక్స్ నిర్వహకులు. ఈ…
టోక్యో ఒలింపిక్స్‌లో బోణీ కొట్టింది భారత్… ఒలింపిక్స్‌లో తొలి రోజే పతకాల వేల ప్రారంభించిన ఇండియా.. వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయ్ చాను సిల్వర్ మెడల్ సాధించారు.. ఇక, ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో కరణ మల్లీశ్వరి పతకం గెలిచిన తర్వాత మీరాబాయి చాను పతకం సాధించారు. దీంతో మీరాబాయిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ప్రధాని మోడీ కూడా ట్వీట్ చేశారు. ”ఎస్. మిరాబాయి చాను భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక క్రీడా టోర్నమెంట్లలో తనను తాను…
టోక్యో ఒలంపిక్స్ విలేజ్‌లో మొదటి కరోనా కేసు నమోదైంది. ఇంకొద్ది రోజుల్లో ఆటలు మొదలవనున్న వేళ కరోనా ఒలింపిక్స్ క్రీడా సంబరం మొదలవనున్న వేళ.. కరోనా వైరస్ కలకలం రేపింది. స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తుండగా గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎవరికి సోకిందన్న విషయం వెల్లడించలేదు ఒలంపిక్స్ నిర్వాహకులు. ప్రస్తుతం అతడిని ఓ హోటల్‌లో ఐసోలేషన్‌లో ఉంచినట్లు ఒలంపిక్స్ సీఈఓ మాసా టకాయా తెలిపారు. గ్రామంలో కోవిడ్ వ్యాప్తి జరగకుండా కట్టడి చర్యలు…
గత ఏడాది జరగాల్సిన టోక్యో ఒలంపిక్స్ కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ గేమ్స్ పై కరోనా నీలి నీడలు కముకున్నాయి. ప్రస్తుతం టోక్యోలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో అక్కడ జపాన్ ప్రభుత్వం కోవిడ్ ఎమర్జెన్సీ ప్రకటించింది. అయితే కేసులు పెరుగుతుండటంతో అత్యవసర సమావేశమైన ఒలంపిక్స్ నిర్వాహకులు ఈ గేమ్స్ కు అభిమానుల అనుమతి నిరాకరించారు. అయితే ఈ ఏడాది జరిగే ఒలంపిక్స్ 2021 ప్రేక్షకులు…