టోక్యో ఒలంపిక్స్ విలేజ్‌లో మొదటి కరోనా కేసు నమోదైంది. ఇంకొద్ది రోజుల్లో ఆటలు మొదలవనున్న వేళ కరోనా ఒలింపిక్స్ క్రీడా సంబరం మొదలవనున్న వేళ.. కరోనా వైరస్ కలకలం రేపింది. స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తుండగా గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎవరికి సోకిందన్న విషయం వెల్లడించలేదు ఒలంపిక్స్ నిర్వాహకులు. ప్రస్తుతం అతడిని ఓ హోటల్‌లో ఐసోలేషన్‌లో ఉంచినట్లు ఒలంపిక్స్ సీఈఓ మాసా టకాయా తెలిపారు. గ్రామంలో కోవిడ్ వ్యాప్తి జరగకుండా కట్టడి చర్యలు తీసుకుంటున్నామని నిర్వాహకులు తెలిపారు.