Rain Alert : దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. పలుచోట్ల ఉరుములు, మేఘాలతో కూడిన వర్షం కురుస్తోంది. గత రెండు రోజులుగా వర్షాలు పెరిగాయి.
హైదరాబాద్‌లో మరోసారి వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. ఇవాళ ఉదయం నుంచి కురిసిన వర్షానికి నగరవాసులు తడిసిముద్దయ్యారు. భారీ వర్షం వల్ల రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపైకి నీరు రావడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.