Rupee Trade: రూపాయల్లో ట్రేడింగ్ జరిపేందుకు ప్రపంచ దేశాల నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చినట్లు ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ రబి శంకర్ వెల్లడించారు. వాణిజ్య చెల్లింపుల నిమిత్తం దేశీయ కరెన్సీలను ఉపయోగించే పథకం కోసం ఆసియన్ క్లియరింగ్ యూనియన్ అన్వేషిస్తోందని తెలిపారు. ద్వైపాక్షికంగా లేదా వివిధ ట్రేడింగ్ బ్లాకుల మధ్య ఇలాంటి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఉంటే ప్రతి దేశానికి చెందిన దిగుమతిదారులు డొమెస్టిక్ కరెన్సీలో పేమెంట్లు చేసేందుకు వీలుపడుతుందని చెప్పారు.
Hyderabad Hosting Restaurant Conclave: హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక సదస్సుకు వేదిక కాబోతోంది. 13వ తేదీన ‘ది ఇండియన్ రెస్టారెంట్ కాన్‌క్లేవ్’కి ఆతిథ్యమివ్వబోతోంది. రెస్టారెంట్ల రంగానికి సంబంధించి ఇదే అతిపెద్ద సమావేశం కానుండటం విశేషం. హైటెక్స్‌లోని హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటుచేసిన ఈ మీటింగ్‌ని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. ‘ది నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ హైదరాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది.
Retirement Age Hike: రిటైర్మెంట్ వయసు పెంచాలనే ప్రతిపాదనకు ఈపీఎఫ్‌ఓ కూడా అనుకూలంగా ఓటేస్తోంది. తద్వారా పెన్షన్ ఫండ్లపై ఒత్తిడి తగ్గుతుందని అంచనా. విజన్-2047 డాక్యుమెంట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. మరో పాతికేళ్లలో మన దేశంలో 60 ఏళ్ల వయసు పైబడేవారి సంఖ్య దాదాపు 140 మిలియన్ల మందికి చేరుతుందని పేర్కొంది. రిటైర్మెంట్ వయసు పెంపు అనేది ఇతర దేశాల్లో అమలవుతున్నట్లు తెలిపింది.
Disney Follows Amazon Prime: అమేజాన్ ప్రైమ్ మాదిరిగానే డిస్నీ కస్టమర్లకి కూడా త్వరలో డిస్నీ ప్రైమ్ అందుబాటులోకి రానున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. సబ్‌స్క్రిప్షన్ సర్వీసులను ప్రారంభించేందుకు ఈ సంస్థ కసరత్తు చేస్తోంది. డిస్నీ ప్లస్ అనే స్ట్రీమింగ్ సర్వీస్‌తోపాటు డిస్నీ ప్రైమ్ కూడా ఆరంభమైతే బ్రాండెడ్ మర్చెండైజ్‌లు, థీమ్ పార్క్‌లు, ప్రొడక్ట్‌లపై డిస్కౌంట్లు ప్రకటించనుంది. అమేజాన్ ప్రైమ్‌ని స్ఫూర్తిగా తీసుకొని డిస్నీ ఎగ్జ్‌క్యూటివ్‌లు ఈ కొత్త ప్రణాళికను రచించారు.
Increase Credit: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించింది. క్రెడిట్ గ్రోత్‌ను మరింత పెంచాలని, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ల స్థితిగతుల పైన కూడా ఫోకస్ పెట్టాలని ఆదేశించింది. నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కార్యకలాపాలను ప్రారంభించటంపై ఆసక్తితో ఉన్నామని ప్రభుత్వం చెప్పినట్లు తెలుస్తోంది.
NPAs may Increase: ఈ సంవత్సరం ఎంఎస్‌ఎంఈ రంగంలో ఎన్‌పీఏలు పెరిగే అవకాశం ఉందని బ్యాంకులు ఆందోళన వ్యక్తం చేశాయి. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ అండ్ ది ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఎంఎస్‌ఎంఈలతోపాటు ఏవియేషన్, టూరిజం, హాస్పిటాలిటీ, పవర్, రిటైల్ ట్రేడ్ వంటి రంగాలకు కూడా ఈ ప్రమాదం ఎదురుకానుందని స్టడీలో పాల్గొన్న బ్యాంకులు పేర్కొన్నాయి.
EPFO News: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో మూడు నెలల నుంచి ప్రతి నెలా 10 లక్షల మందికి పైగానే ఉద్యోగులు నమోదవుతుండటం విశేషం. ఏప్రిల్‌లో 10 లక్షల 9 వేలు, మే నెలలో 10 లక్షల 7 వేలు, జూన్‌లో 10 లక్షల 54 మందికి పైగా చేరినట్లు జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది.
Investment-Profit: జెన్‌సోల్ ఇంజనీరింగ్ కంపెనీ షేర్ల విలువ ఆకాశమే హద్దుగా ఏడాదిలోనే 2,600 శాతం పెరిగింది. సంవత్సరం కిందట పెట్టిన 10 వేల రూపాయల పెట్టుబడి ఇప్పుడు ఏకంగా 2.77 లక్షలకు పెరిగింది. అహ్మదాబాద్‌కి చెందిన ఈ రెనివబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడర్.. ఐదారు లక్షలకే ఎలక్ట్రిక్ కారును అందుబాటులోకి తేనుంది.
ఏపీలో ఇవాళ ప్రత్యేకమయిన రోజు. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై ఇవాళ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. అమరావతి రైతుల పిటిషన్లపై తీర్పు వెలువరించనుంది ఏపీ హైకోర్టు ధర్మాసనం. ఇప్పటికే ప్రభుత్వ, పిటిషన్ దారుల వాదనలు పూర్తి అయ్యాయి. ఫిబ్రవరి నాలుగో తేదీన తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు ధర్మాసనం. తీర్పు ఇవ్వనున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం. సుమారు 70 పిటిషన్లపై…