Today (18-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్‌లో వరుసగా రెండో రోజు కూడా జోష్ కనిపించింది. ఇవాళ బుధవారం ఉదయం రెండు కీలక సూచీలు ఊగిసలాట ధోరణిలో ప్రారంభమైనప్పటికీ సాయంత్రం వరకు భారీగా లాభాల బాటలో పయనించాయి. సెన్సెక్స్ ఏకంగా 61 వేల పాయింట్లు అధిగమించింది. నిఫ్టీ 18 వేల పాయింట్లకు పైనే ట్రేడ్ అయింది. ఎంపిక చేసిన ఫైనాన్షియల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా బెంచ్‌మార్క్ సూచీలకు లాభాలు కొంత వరకు తగ్గినా…