అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్‌కు మరోసారి పోస్టుమార్టం నిర్వహించాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది. జుబీన్ గార్గ్ మరణంపై పెద్ద ఎత్తున అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జుబీన్ గార్గ్ భార్య అనుమతితో రీపోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు.
నేడు మహారాష్ట్రలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది. దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో కొత్త మంత్రులు కొలువుదీరబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు జరగనుంది. రాజ్‌భవన్‌లోని ప్రాంగంణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో చివరి మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. రెండో రోజు టీమిండియా పట్టు బిగించింది. కివీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే పరిమితం చేసింది. ఈ రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 171/9 పరుగులు చేసింది.
దక్షిణాదిలోని పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఇప్పటికే తమిళనాడు, కేరళ సహా పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా శనివారం, ఆదివారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది.
చీరాల మండలం జాండ్రపేట బీవీ అండ్ బీఎన్ ఉన్నత పాఠశాలలో నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి నేడు సీఎం చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. అనంతరం చేనేత కార్మికులతో కార్మికులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.
M Revanth Reddy: వేల సంవత్సరాల నాటి చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలతో నిండిన తెలంగాణకు మీలో ప్రతి ఒక్కరికి స్వాగతం అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ వద్ద కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
నేడు వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి.. 1.30 కి వరంగల్ కు చేరుకుంటారు. అక్కడ.. మేఘా టెక్ట్స్ టైల్ పార్క్ ని పరిశీలిస్తారు. ఆ తర్వాత సెంట్రల్ జైలులో నిర్మాణం చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలిస్తారు. ఆ తర్వాత హన్మకొండ కలెక్టరేట్లు వహించనున్న గ్రేటర్ వరంగల్ పై రివ్యూ మీటింగ్ చేపట్టనున్నారు. సాయంత్రం అక్కడి నుంచి బయల్దేరి బేగంపేట…