PM Modi: అధికారమే లక్ష్యంగా పని చేయండి.. బెంగాల్ ఎంపీలకు మోడీ దిశానిర్దేశం
- వచ్చే ఏడాది ప్రారంభంలోనే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు
- బెంగాల్ ఎంపీలు, రాష్ట్ర నేతలతో ప్రధాని మోడీ భేటీ
- అధికారమే లక్ష్యంగా పని చేయండి
- బెంగాల్ ఎంపీలకు మోడీ దిశానిర్దేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే ఏడాది ప్రారంభంలోనే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీహార్ ఎన్నికల్లో మాదిరిగానే.. పశ్చిమ బెంగాల్ ఎన్నికలను కూడా కమలనాథులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. నాలుగోసారి అధికారంలోకి రావాలని మమతా బెనర్జీ ప్రయత్నిస్తుంటే.. ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని కాషాయ పార్టీ ఉవ్విళ్లూరుతోంది.
ఇది కూడా చదవండి: Revanth Reddy: ఢిల్లీ టూర్‌లో రేవంత్‌రెడ్డి.. ప్రధాని, కేంద్రమంత్రులతో వరుస భేటీలు
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
ఇందులో భాగంగానే బుధవారం బెంగాల్ బీజేపీ ఎంపీలు, రాష్ట్ర నాయకులతో ప్రధాని మోడీ ప్రత్యేక భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అధికారమే లక్ష్యంగా పని చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ‘సర్’పై ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతాన్ని పట్టించుకోవద్దని సూచించారు. ఓటర్ సర్వే అనేది ఎన్నికల సంఘం చేపట్టే ఒక సరళమైన కార్యక్రమాన్ని పేర్కొన్నారు. దీనిపై ఎవరూ కూడా కంగారు పడొద్దని తెలిపారు. ‘‘SIR అంటే అర్హత ఉన్న ఓటర్లను చేర్చడం.. అర్హత లేని వారిని తొలగించడం మాత్రమే.’’ అని ప్రధాని అన్నారు.
ఇది కూడా చదవండి: Imran Khan: ఆసిమ్ మునీర్ భారత్‌తో యుద్ధానికి ఆరాటపడుతున్నాడు.. ఇమ్రాన్ ఖాన్ సోదరి సంచలన వ్యాఖ్యలు
అందరూ సమిష్టిగా.. నమ్మకంతో కృషి చేస్తే 2026లో బెంగాల్‌లో అధికారం చేపట్టడం ఖాయమని అని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల కథనాలతో పరధ్యానం చెందవద్దని ఎంపీలను హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్‌లో 2011లో ముగ్గురు ఎమ్మెల్యేల నుంచి 2016లో బలమైన ఉనికిని సాధించామని.. బీజేపీ ఎంత వేగంగా పుంజుకుందో గుర్తించుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు షమిక్ భట్టాచార్య, కేంద్ర మంత్రులు శాంతను ఠాకూర్, సుకాంత మజుందార్ పాల్గొన్నారు. ఎన్నికల సన్నద్ధత, రాష్ట్రవ్యాప్తంగా మద్దతును సమీకరించడానికి రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని ప్రధాని సూచించారు. ఇప్పటికే బెంగాల్ బాధ్యతలు భూపేంద్ర యాదవ్, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లాబ్ దేబ్‌లకు అప్పగించింది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!