ప్రచారంలో ప్రతి ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ.. అందరూ కూడా టీడీపీకి ఓటు వేయాలని ప్రజలను కొలికపూడి కోరారు.
తిరువూరు పట్టణం 20వ వార్డులో ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు ప్రవేశ పెట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ.. టీడీపీని గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తిరువూరు పట్టణంలోని 19వ వార్డులో ఎన్డీయే కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రతి ఇంటిఇంటికి తిరిగిన కొలికపూడికి మహిళలు మంగళ హారతులు, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు.
6 నెలలుగా నాకు సీటు రాకుండా కుట్రలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు మ్మెల్యే రక్షణ నిధి.. ఎంపీ కేశినేని నాని.. వైసీపీలోకి వచ్చే ముందే తిరువూరు సీటు కండీషన్ పెట్టారని.. అందుకే నన్ను తప్పించడానికి రకరకాల సర్వేలు చేయించి చివరికి సీటు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.