YSRCP: ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కరపత్రాలు కలకలం రేపుతున్నాయి.. ఎమ్మెల్యే రక్షణ నిధి మాకొద్దు అంటూ వెలిసిన కరపత్రాలు తీవ్ర చర్చకు దారి తీశాయి.. అయితే, తిరువూరు నియోజకవర్గ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత కొంతకాలంగా వర్గ విభేదాలు నడుస్తున్నాయి.. గడప గడపకు ముగింపు సభలో హ్యాట్రిక్ ఎమ్మెల్యే రక్షణ నిధి అంటూ కొందరు నేతలు పొగడ్త వర్షం కురిపించారు.. ఎమ్మెల్యే రక్షణ నిధిపై కొందరికి అభిప్రాయా బేధాలు ఉంటే మనసులో పెట్టుకోకుండా మంచి మెజారిటీతో 2024లో జరిగే ఎన్నికల్లో గెలిపించాలి అని కూడా నేతలు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు..
Read Also: Bro Pre Release Event: దెబ్బకు రీ సౌండ్ రావాలి ‘బ్రో’…
అయితే, నేతల ప్రసంగం, ఎమ్మెల్యే పై గుట్టు చప్పుడు కాకుండా కొందరు వ్యక్తులు కరపత్రం ముద్రించి పంచారు.. తిరువూరు నగర పంచాయతీ పాలకవర్గం, చైర్మన్ నీ మార్పు విషయంలో వైసీపీ పాలకవర్గం సభ్యులు రెండుగా చీలిన విషయం విదితమే కాగా.. చైర్మన్ మార్పు విషయంలో పార్టీలో అంతర్గత వర్గవిబేధాలు బయటపడిన విషయం విదితమే కాగా.. మరోసారి ఇప్పుడు తిరువూరు వైసీపీలో వర్గ విబేధాలు కరపత్రాల రూపంలో బయటపడ్డాయి.. ఎమ్మెల్యే రక్షణ నిధి మాకొద్దు అంటూ కరపత్రాలు ప్రత్యక్షమై కలకలం సృష్టించాయి.. తిరువూరు పట్టణంలో జగనన్న ముద్దు.. రక్షణ నిధి వద్దంటూ కరపత్రాలు వెలుగు చూడటంతో ఒకేసారిగా అవాక్కు అవుతున్నాయి వైసీపీ శ్రేణులు. వైసీపీ ఆఫీసు ముందు, షాపుల ముందు కరపత్రాలు కనబడటంతో ఒకేసారి అవాక్కయి ఇది ఎవరు చేశారనే ఆరా తీసే పనిలో పడిపోయారు వైసీపీ నేతలు, కార్యకర్తలు.. అయితే, ఇది వైసీపీలోని ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం పనా? ప్రతిపక్షాల పనా? అనేది కూడా తేలాల్సి ఉంది.