తిరువూరు పట్టణం 20వ వార్డులో ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు ప్రవేశ పెట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ.. టీడీపీని గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొలికపూడి శ్రీనివాసరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలుగా అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు తీవ్రమైన నష్టం కలిగిందన్నారు. చంద్రబాబు నాయుడు 4000 పెన్షన్ ఇస్తానని ప్రకటించి రెండు నెలలు అయింది అని కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు.
Read Also: Minister Seethakka: బీజేపి, ఆర్ఎస్ఎస్ పై మంత్రి సీతక్క హాట్ కామెంట్స్
ఇక, చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేసి సంపద సృష్టించి ఆ సంపదను ప్రజలకు పంచె క్రమంలో భాగంగా పెన్షన్ 4000 రూపాయలు చేస్తానని ప్రకటించారు అని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు వెల్లడించారు. పెట్టుబడుల ఆకర్షించడం, కంపెనీలు తీసుకురావడం కోసం చాలా కృషి చేస్తారని చెప్పుకొచ్చారు. తిరువూరు అభివృద్దికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది.. నాకు ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఓటర్లను కొలికపూడి శ్రీనివాసరావు కోరారు.