MLA Kolikapudi New Controversy: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తీరుమారడంలేదు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కొలికపూడి… సొంత పార్టీ నేతలతోనే కెలుక్కోవడంలో ముందుంటారు. ఆయన తీరు… ఒక్కోసారి మంచికి పోతున్నా చెడు ఎదురవుతున్న పరిస్థితి. స్థానిక నేతలతో వివాదాలు, సొంత పార్టీ నేతలతో విభేదాలతో కొలికపూడి బిజీగా ఉంటారు. ఆ మధ్య విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మాఫియాలను పెంచి పోషిస్తున్నారన్నారు. తనకు టికెట్ ఇప్పించేందుకు చిన్ని డబ్బులు…
మాజీ మంత్రి పెద్దిరెడ్డితో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి వీడియో వైరల్ అవుతోంది. ఈ అంశంపై తాజాగా కొలికపూడి శ్రీనివాసరావు స్పందించారు. ఈ నెల 19తేదీన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినట్లు జరిగిందని తెలిపారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి ఇండిగో విమానంలో వెళ్ళే క్రమంలో వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం కూడా ప్రయాణం చేశారన్నారు.