MLA Kolikapudi: మాజీ మంత్రి పెద్దిరెడ్డితో టీడీపీ ఎమ్మెల్యే కోలికపూడి వీడియో వైరల్.. స్పందించిన ఎమ్మెల్యే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి పెద్దిరెడ్డితో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి వీడియో వైరల్ అవుతోంది. ఈ అంశంపై తాజాగా కొలికపూడి శ్రీనివాసరావు స్పందించారు. ఈ నెల 19తేదీన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినట్లు జరిగిందని తెలిపారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి ఇండిగో విమానంలో వెళ్ళే క్రమంలో వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం కూడా ప్రయాణం చేశారన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని సార్ బాగున్నారా? అని అడిగానని తెలిపారు.. బాగున్నాను అని చెప్పి వారు వెళ్ళిపోవడం మొత్తం కలిసి 8 సెకండ్స్ లోపే జరిగిందని స్పష్టం చేశారు. తాను తిరుపతి పర్యటనలో ఉండగానే సీఎం కార్యాలయం నుంచి రావాలని కబురు అందిందన్నారు. మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 10.40వరకు సీఎం కార్యాలయంలోనే ఉన్నట్లు వెల్లడించారు. 40 నిమిషాల సేపు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అయినట్లు స్పష్టం చేశారు. అదే రోజు రాత్రి అమరావతి నుంచి తిరువూరుకు వచ్చినట్లు చెప్పారు.
READ MORE: Pakistan: పాక్ మిస్సైల్ విఫలం.. సొంత ప్రజలపైనే కూలిన షాహీన్-3 క్షిపణి..
Also Read
- CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై పిల్ కొట్టేయండి.. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్
- Saturday Horoscope: సెప్టెంబర్ 5 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
- Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
నిన్న, ఈరోజు తిరువూరులోని అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. వాస్తవానికి విరుద్ధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాజమండ్రిలో కలిసినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారం చేసేవారికి ఒకరోజు బియ్యం వస్తాయేమో కానీ దాని గురించి ఏమీ రావన్నారు. సంవత్సరం కాలం నుంచి దుష్ప్రచాలు చేసినవారికి వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలుసు.. కేవలం ఈ వీడియో ద్వారా ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తే దాన్ని స్పష్టం చేసేందుకే మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. కానీ దుర్మార్గం ఏంటంటే బొత్స సత్యనారాయణ, అయ్యన్నపాత్రుడు వాటేసుకుని నవ్వుతూ మాట్లాడిన వీడియోలు బయకొచ్చాయి కానీ దాని గురించి ఎవరూ మాట్లాడరు.. వాస్తవాలను వక్రీకరించే వారికి నేను చెప్పేది ఒకటే.. మీరు ఎన్ని అబద్ద ప్రచారాలు చేసినా కూడా తిరువూరు నియోజకవర్గ ప్రజలకు వాస్తవాలు ఏంటో తెలుసు. సీఎం చంద్రబాబు మూడు రోజుల క్రితం పిలిచి సంవత్సరకాలంలో ఎమ్మెల్యేగా తన పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది.. సీఎం చంద్రబాబు నా పనితీరును 66.4% మార్కులు ఇవ్వడం జరిగింది.. తిరువూరు నియోజకవర్గంలో అవినీతికి సంబంధించి 5.5% ఆరోపణలు ఉన్నట్లు ప్రోగ్రెస్ రిపోర్ట్ ద్వారా తెలిపారు.. నేను ఏం చేస్తున్నాను, ఎలా పనిచేస్తున్నాను,నాకు తెలుసు, నా తిరువూరు ప్రజలకు తెలుసు, సీఎం చంద్రబాబు కూడా తెలుసు.. ఇలాంటి గాలి వార్తలను పట్టించుకోవద్దని అందరికీ తెలియజేస్తున్నాను..” అని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
-
India vs Pakistan: నేడు భారత్ vs పాకిస్తాన్ మహిళల టీ20 మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా లైవ్ చూడాలి?
-
Anand Devarakonda: బేబీ ఆడియో ఫంక్షన్లో చెప్పలేకపోయా.. ఇప్పుడు మాత్రం ధైర్యంగా చెప్తా మా వదినా!
-
Kavin: కెవిన్ కవల పిల్లలకు ఆ పేర్లు.. ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన హీరో!
-
Fitna al-Hindustan: ఇండియానే టార్గెట్ చేస్తోన్న పాకిస్థాన్.. ‘ఫిత్నా అల్-హిందుస్తాన్’ పేరుతో కొత్త కుట్ర?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!