Tirupati Murder Mystery: తిరుపతి సమీపంలోని పాకాల మండలం మూలకోన అటవీ ప్రాంతంలో లభించిన మృతదేహాల మిస్టరీలో మరో ట్విస్ట్ నెలకొంది. అక్కడ లభించిన నాలుగు మృతదేహాలపై పోలీసులు ఎట్టకేలకు క్లారిటీకి వచ్చారు. నిన్న ( సెప్టెంబర్ 15న) పోలీసులు గుర్తించిన మృతదేహం పాండిచ్చేరికి చెందిన కలై సెల్వన్‌దే అని తేలింది. అదే ప్రదేశంలో లభించిన మహిళాతో పాటు ఇద్దరు చిన్నారుల మృతదేహాలు తమిళనాడుకు చెందిన జయమాలిని, ఆమె ఇద్దరు కుమార్తెలవే కావొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, గత జూలైలో జయమాలిని, ఇద్దరు పిల్లలు కనిపించడం లేదని తమిళనాడు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. జయమాలిని భర్త వెంకటేశన్ అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. కువైట్‌లో పని చేస్తున్న వెంకటేశన్, జూలైలో ఇంటికి వచ్చినప్పుడు భార్య, పిల్లలు కనిపించకపోవడంతో అనుమానంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Also: Dulquer Salmaan : నిర్మాతగా ఆ సినిమాలో నేను పెట్టిన డబ్బు మొత్తం పోతుందనుకున్నాను
ఇక, సీడీఆర్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు కేసులో పురోగతి సాధించారు. ప్రస్తుతం వెంకటేశన్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. కలై సెల్వన్‌కు జయమాలిని కుటుంబంతో ఉన్న సంబంధాలపై కూడా ఆరా తీస్తున్నారు. అయితే, నలుగురి మరణాలు హత్యలేననే అనుమానిస్తున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.