Love Turns Tragedy: పెళ్లయ్యాక అతనితో ఎఫైర్.. లాడ్జిలో షాకింగ్ దృశ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lovers Commits Suicide In TIrupati Lodge: ప్రేమించుకున్న ఓ జంటను కులం విడదీసింది కానీ, వారి మనసుల్ని మాత్రం వేరు చేయలేకపోయింది. వారి మధ్య ప్రేమను చెరపలేకపోయింది. అందుకే.. వేర్వేరుగా ఉండలేక, కలిసి చనిపోవాలని ఆ జంట నిర్ణయించుకుంది. ఈ ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన అనూష(21)కు రెండేళ్ల క్రితం తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గుడ్ల పోసిబాబుతో వివాహంతో జరిగింది. ఈ జంట కొవ్వూరులో నివాసం ఉంటోంది.
అయితే.. అనూష పెళ్లి కాకముందే షాపూర్ ప్రాంతానికి చెందిన కృష్ణారావుతో ప్రేమ వ్యవహారం నడిపింది. వీళ్లు పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకుని, తమ పేరెంట్స్‌కి విషయం చెప్పారు. కానీ, కులాలు వేరు కావడంతో పెద్దలు వారి పెళ్లికి అంగీకరించలేదు. ఈ క్రమంలోనే అనూషకు రెండేళ్ల క్రితం పోసిబాబుకి వివాహం జరిపించారు. పెద్దల ఒత్తిడితో అనూష అయిష్టంగానే ఆ పెళ్లి చేసుకుంది. కానీ, కృష్ణారావుని మరువలేకపోయింది. అందుకే, పెళ్ళైనా అతనితో అనుబంధం కొనసాగించింది. కానీ, ఎన్నాళ్లిలా కలుసుకుంటాం? జీవితాంతం కలిసి ఉండలేం కదా! అని ఆ జంట అనుకుంది. దీంతో.. చావులోనైనా కలిసుందామని నిర్ణయించుకుంది.
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- OTR: టీడీపీ ఎమ్మెల్యేకు నిద్ర పట్టడం లేదా..? ఎందుకంత కష్టమొచ్చింది..?
- AP Heavy Rain Alert: తీరంవైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. దంచికొడుతున్న వానలు..
ఈ నేపథ్యంలోనే ఈనెల 5వ తేదీన ఇద్దరూ కలిసి తిరుపతికి వెళ్లారు. అక్కడ త్రిలోక్ లాడ్జిలో రూమ్ బుక్ చేసుకున్నారు. ముందుగా అనుకున్నట్టుగానే.. అక్కడే ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం ఉదయం వాళ్లు ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో.. లాడ్జి సిబ్బందికి అనుమానం వచ్చి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. అటు.. ఈనెల 5న తన భార్య కనిపించడం లేదని పోసిబాబు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే తిరుపతిలోని లాడ్జిలో అనూష ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెలుసుకొని, విషయం కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!