తిరుపతిలోని ఓ సినిమా థియేటర్‌లో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. భూమా సినీ కాంప్లెక్స్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఈ కాంప్లెక్సులోని విఖ్యాత్ థియేటర్ బాల్కనీలో ఉండే 180 సీట్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. కాగా కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ఈ థియేటర్‌లో ప్రదర్శనలు నిలిపివేశారు. Read Also: నిజాయతీకి ప్రతిఫలం.. 54వ సారి IAS అధికారి బదిలీ కాగా ప్రమాదం…
మా అధ్యక్షుడు మంచు విష్ణు మరియు మంచు లక్ష్మీ తిరుపతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రేణిగుంట ఎయిర్ పోర్ట్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు ఆయన అభిమానులు. వీరు ఇవాళ శ్రీవారిని దర్శంచుకోనున్నారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ… నూతన “మా” భవానానికి 3 నెలలోగా స్పష్టత ఇస్తానని చెప్పారు. విష్ణు గెలవాలని ఆంధ్ర,తెలంగాణ ప్రజలు సపోర్ట్ చేశారని.. విష్ణు గెలుపును కోరుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు మంచు లక్ష్మి. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో…
ప్రధాని నరేంద్ర మోడీపై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మోడీ చేతకానిపాలనతో దేశం మొత్తం అతలాకుతలమైందని ఆరోపించారు.. కేంద్రమంత్రి కొడుకు ఆశిష్ మిశ్ర రైతులపై కారు ఎక్కించి చంపేశారు… సీసీ కెమెరాల్లో కేంద్రమంత్రి కొడుకు అడ్డంగా దొరికితే ప్రధాని వెంటనే ఎందుకు స్పందించలేదని నిలదీశారు.. సుప్రీంకోర్టు స్పందిస్తే కేసు పెట్టి అరెస్ట్ చేస్తారా..? జైలులో కేంద్రమంత్రి కొడుక్కి రాజభోగాలా..? అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.. శ్రీవారి దర్శనార్థం రేపు తిరుమలకు రానున్నారు చీఫ్ జస్టిస్… మధ్యాహ్నం తిరుపతికి చేరుకోనున్న ఆయన.. ఆ తర్వాత తిరుచానూరుకు వెళ్లనున్నారు. పద్మావతి అమ్మవారిని దర్శించుకుని అక్కడ నుంచి తిరుమలకు చేరుకుంటారు.. ఇక, ఎల్లుండి (శుక్రవారం) ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.. ఎన్వీ రమణతో పాటు పలువురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు.. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా కూడా తిరుమలకు…
తిరుపతిలో సీఎం జగన్ రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం గన్నవరం నుంచి తిరుపతికి చేరుకున్నారు. అనంతరం సీఎం జగన్ బర్డ్‌లో శ్రీ పద్మావతి చిన్న పిల్లల కార్డియాక్ ఆసుపత్రిని ప్రారంభించారు. ఆ తరువాత అలిపిరి వద్ధ శ్రీవారి పాదాల వద్ద నుంచి నడక మార్గంలో కొత్తగా ఏర్పాటు చేసిన పైకప్పును, గో మందిరాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు. తిరుమలకు చేరుకున్న తరువాత సీఎం బేడి…
టీటీడీ పాలకమండలి ఇవాళ జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.. జమ్మూలో శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి రూ.17.40 కోట్లతో టెండర్లకు ఆమోదముద్ర వేసింది. చెన్నై, బెంగళూరు, ముంబైలో టీటీడీ సమాచార కేంద్రాలు మరియు శ్రీవారి ఆలయాల స్థానిక సలహా మండళ్లకు ఛైర్మన్ల నియామకానికి ఆమోదం లభించగా.. చెన్నై కేంద్రానికి ఏజే శేఖర్ రెడ్డి, బెంగళూరు కేంద్రానికి రమేష్ శెట్టి, ముంబై కేంద్రానికి అమోల్ కాలేను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక, అలిపిరి కాలిబాట సుందరీకరణ…
తిరుపతిలో భారీ భూ కుంభకోణం వెలుగు చూసింది. నకిలీ పత్రాలు సృష్టించి వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కాజేసే ప్రయత్నం చేసింది ఓ కుటుంబం. 1577 ఎకరల ప్రభుత్వ భూమిని ఆన్‌లైన్‌లో తమ పేర్లపైకి మార్చుకున్నారు కేటుగాళ్లు. 13 మండలాల్లోని 93 సర్వే నంబర్లలో గల 2 వేల 320 ఎకరాల స్థలాన్ని కాజేసే ప్రయత్నం చేసింది ఆ కుటుంబం. ఒక్క రోజులోనే ఈ భూములకు యజమానులు తమ పేర్లను నమోదు చేశారు గజ…
సర్వదర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో జారీ చేసేందుకు సిద్ధమైంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఇప్పటికే ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించగా… ఈ నెల 24వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది.. దీనికి ఒక్కరోజు ముందుగా.. అంటే.. ఈ నెల 23వ తేదీన అక్టోబర్ మాసానికి సంబంధిచిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ.. ఇవి కూడా ఆన్‌లైన్ ద్వారా పొందే వీలుంది.. రోజుకి 8 వేల చొప్పున టిక్కెట్లును…
శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ.. రేపటి నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్టు ప్రకటించింది… రేపటి నుంచి అలిపిరి వద్ద రోజుకి 2 వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనుంది తిరుమల తిరుపత దేవస్థానం.. అయితే, ప్రస్తుతం చిత్తూరు జిల్లా వాసులకు మాత్రతే టోకెన్లు జారీని పరిమితం చేయనుంది టీటీడీ.. కాగా, ప్రస్తుతం ఇస్తున్న దర్శనం కోటాలో 20 నుండి 30 శాతం సర్వదర్శనం ఉండేలా నిర్ణయం తీసుకోనున్నట్టు ఈ మధ్యే ప్రకటించారు టీటీడీ…
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి ప్రతీరోజు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.. ఇక, నడక మార్గంలో వెళ్లి మొక్కులు చెల్లించుకునే భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు.. అయితే, మరమ్మతులు, ఆధునీకరణ పనుల కోసం అలిపిరి నడక మార్గాన్ని పూర్తిగా మూసివేసిన అధికారులు.. వేగంగా పనులు పూర్తిచేసే పనిలో పడిపోయారు.. ప్రస్తుతం శ్రీవారి మెట్టు మార్గం నుంచి తిరుమలకు నడకదారి భక్తులు వెళ్తుండగా.. టీటీడీ భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పింది.. అక్టోబర్ 1వ తేదీ నుంచి అలిపిరి నడకమార్గంలో…