తిరుపతిలో ఇటీవలే భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. భారీ వర్షాల కారణంగా నగరంలో అనేక ఇబ్బందులు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇక తిరుపతిలోని కృష్ణానగర్‌లోని ప్రజలు గత రెండు రోజులుగా భయంతో వణికిపోతున్నారు. వర్షాల తరువాత కృష్ణానగర్‌లోని ఓ మహిళ ఇంట్లోని వాటర్ ట్యాంక్ భూమిలో నుంచి పైకి వచ్చింది. ఈ సంఘటన తరువాత కృష్ణానగర్‌లోని ప్రజలు కంటిమీద కునుకులేకుండా కాలం గడుపుతున్నారు. Read: లైవ్: ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ ఎటు…
తిరుపతి జలదిగ్భందంలో చిక్కుకుంది. రోడ్లు కాలువల్లా మారాయి. కాలనీలు కుంటలను తలపిస్తున్నాయి. నగరంలో ఎక్కడ చూసినా వరదే..! రెండు రోజులుగా వరద నీటిలోనే మగ్గుతున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలు. తిరుపతి అతలాకుతలమైంది. కొండ పైనుంచి వచ్చిన వరద ప్రవాహం తిరుపతిని ముంచేసింది. జడివాన దెబ్బకు చిగురుటాకులా వణికిపోయింది.ఇప్పటికీ నలువైపులనుంచి వరద వస్తూనే ఉంది. మోకాలి లోతు నీటిలో ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు.కాలువులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ఉధృతికి కాలువలు సరిపోవడం లేదు. దాంతో ఉప్పొంగిపారుతున్నాయి. తిరుపతి పట్టణంలోని…
సీనియర్ నటుడు, నిర్మాత మోహన్‌బాబు నివాసంలో విషాదం నెలకొంది. మోహన్‌బాబు సోదరుడు రంగస్వామి నాయుడు గుండెపోటుతో బుధవారం మృతి చెందారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రంగస్వామి నాయుడు చనిపోయినట్లు తెలుస్తోంది. ఆయన వయసు 63 సంవత్సరాలు. కొంత కాలంగా రంగస్వామినాయుడు అనారోగ్యంతో బాధ పడుతున్నారు. తిరుపతిలో ఉంటూ వ్యవసాయం చేసుకునే ఆయన… మోహన్‌బాబు చేపట్టే పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు అని సన్నిహితులు చెప్తున్నారు. Read Also: వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి చేయాలి: చిరంజీవి…
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక.. రెండు రోజుల పాటు.. తిరుమలకు వెళ్లే రెండు నడకదారులను మూసివేయాలని నిర్ణయించింది టీటీడీ.. రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన టీటీడీ.. ముందస్తు చర్యలు చేపట్టింది.. అందులో భాగంగా.. బుధ, గురువారాల్లో తిరుమలకు వెళ్లే రెండు నడకదారులైన అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించింది… వర్షాల నేపథ్యంలో.. భక్తుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్… రెండు రోజుల తిరుపతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు గన్నవరం నుంచి రేణిగుంటకు బయల్దేరి వెళ్తారు జగన్. అలాగే, రాత్రి 7 గంటల ప్రాంతంలో రేణిగుంటకు చేరుకునే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు జగన్ స్వాగతం పలుకుతారు. అనంతరం రేణిగుంట నుంచి తిరుమల చేరుకుంటారాయన. రాత్రి తొమ్మిదిన్నరకు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. తర్వాత తిరిగి రేణిగుంటకు చేరుకుని… అక్కడి నుంచి తాడేపల్లికి బయలుదేరుతారు ముఖ్యమంత్రి.…
ఈనెల 14న తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఈ భేటీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరవుతారు. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయంతో పాటు కేంద్ర, రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని పలు కీలకమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం…
తిరుపతి నగర వాసులకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుభవార్త అందించారు. తిరుపతికి వచ్చే యాత్రికుల ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు చేపట్టిన శ్రీనివాస సేతు (గరుడ వారధి)ని నవంబరులో ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. తిరుమలలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ గిరీష్, ఆఫ్ కాన్ సంస్థ ప్రతినిధి రంగ స్వామి ఇతర అధికారులతో శ్రీనివాస సేతు నిర్మాణ పనులపై వైవీ సుబ్బారెడ్డి సమీక్ష నిర్వహించారు. Read Also: తెలుగుకి ఇప్పుడు…