తిరుపతిలో భారీ భూ కుంభకోణం వెలుగు చూసింది. నకిలీ పత్రాలు సృష్టించి వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కాజేసే ప్రయత్నం చేసింది ఓ కుటుంబం. 1577 ఎకరల ప్రభుత్వ భూమిని ఆన్‌లైన్‌లో తమ పేర్లపైకి మార్చుకున్నారు కేటుగాళ్లు. 13 మండలాల్లోని 93 సర్వే నంబర్లలో గల 2 వేల 320 ఎకరాల స్థలాన్ని కాజేసే ప్రయత్నం చేసింది ఆ కుటుంబం. ఒక్క రోజులోనే ఈ భూములకు యజమానులు తమ పేర్లను నమోదు చేశారు గజ కంత్రీ. ఇక రంగంలోకి దిగిన CID అధికారులు… ప్రధాన నిందితులైన మోహన్, గణేశ్ పిళ్లై, మధుసూదన్, రాజన్, కోమల, రమణలను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితురాలు ధరణి పరారీలో ఉంది. నిందితుల నుంచి 40 నకిలీ ప్రతాలను స్వాధీనం చేసుకున్నారు CID అధికారులు.