AM Rathnam Appointed as Janasena Campaigning Committee Secretary: ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ఏఎం రత్నం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన కుమారులలో ఒకరు హీరోగా 7/G బృందావన్ కాలనీ లాంటి సినిమాతో హిట్ కొట్టగా మరో కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకుడిగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఏఎం రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హరిహర వీరమల్లు అనే సినిమా…
రేపు ( సోమవారం) తిరుమలలో శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం ఘనంగా జరుగనుంది. తీర్థానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇవాళ అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల చేయనున్నారు. మే నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను నేడు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అంతేకాదు మే నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారి కోటా టోకెన్లు విడుదల చేయనున్నారు.
తిరుపతి జూపార్క్ ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతుడు ప్రహ్లాద్ గుర్జార్ సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూకినట్లు తేలింది. సింహం తలను ముట్టుకుంటానని, అనుమతించాలని సెక్యూరిటీ సిబ్బందితో గొడవకు దిగినట్లు తెలిసింది.
తిరుమలలో ఇవాళ శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. ఈ సందర్భంగా నేడు వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాద పద్మారాధన సేవలు రద్దు చేసిన టీటీడీ తెలిపింది. ఇక, తిరుమలలో ఈ నెల 23వ తేదీ నుంచి జనవరి 1వ తేది వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగనున్నాయి.
Rohit Sharma Visits Tirupathi Balaji Temple ahead of Asia Cup 2023: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం రోహిత్ తన కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. రోహిత్ సతీమణి రితిక సజ్దే, కూతురు సమైరా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు భారత కెప్టెన్‌కు స్వాగతం పలికి.. దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి.. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. రోహిత్…
తిరుపతి-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ లోని ఓ బోగీలో ఒక్క సారిగా పొగలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులందరూ ఆందోళన చెందారు. అయితే ఎలాంటి ప్రమాదమూ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.