భారీవర్షాల కారణంగా తిరుమలకు రాకపోకలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో తిరుమల ఘాట్ రోడ్డులో తనిఖీలు నిర్వహించారు ఇఓ జవహర్ రెడ్డి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. సోషల్ మీడియా సమాచారం విశ్వసించవద్దని, వర్షం వల్ల దర్శనానికి రాలేకపోతే.. తర్వాత దర్శించుకునే అవకాశం ఇస్తామన్నారు జవహర్ రెడ్డి. భక్తులకు ఇబ్బందులు కలగకుండా తిరుమలలో భక్తులకు అన్నప్రసాద సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. తిరుపతిలో భక్తులకు వసతి సౌకర్యం కల్పించామని, వర్షం కారణంగా దర్శనానికి రాలేని భక్తులను తరువాత రోజులలో దర్శనానికి…
తిరుపతి వర్షంతో వణికిపోతోంది. వరుణ దేవుడు తన ప్రతాపం చూపడంతో ఆధ్యాత్మిక క్షేత్రం అల్లాడిపోతోంది. ఎటు చూసినా వరదలే. జనం అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నారు. తిరుపతిలోని మ్యూజియం పక్కనే వున్న ఏపీ టూరిజం హోటల్ వెనుక వైపున విరిగి పడ్డాయి కొండచరియలు. గోడకూలి ఇరుక్కుపోయారు వంట మాస్టర్, మరో మహిళ. ఇరువురిని కాపాడి ఆస్పత్రికి తరలించారు ఫైర్ సిబ్బంది. పీలేరు సమీపంలో అగ్రహారం చెరువు పూర్తిగా నిండడంతో చెరువు తెగే ప్రమాదం ఏర్పడింది. దిగువ భాగాన…
ఏపీని భారీవర్షాలు వణికిస్తున్నాయి. చెన్నైకి ఆగ్నేయంగా 310కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతమయి వుంది. రేపు తమిళనాడు,దక్షిణ కోస్తా మధ్య తీరం దాటనున్న వాయుగుండం. కడప, చిత్తూరు జిల్లాలకు రెడ్ మెస్సేజ్ వార్నింగ్ జారీ చేసిన ఐఎండీ. రెండు జిల్లాలలో రేపటి వరకు భారీ వర్షాలు. ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం వుంది. నెల్లూరు జిల్లా కావలిలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. జలదిగ్బంధంలో కపిలతీర్దం. ఆలయంలోకి భక్తుల అనుమతి నిలిపివేసింది టీటీడీ.…
భారీవర్షాలు, వరదలు చిత్తూరు జిల్లాను వణికిస్తున్నాయి. జిల్లాకు ఇవాళ,రేపు భారీవర్ష సూచన ఉందన్నారు కలెక్టర్ హరినారాయణ. ఈ ఏడాది జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైందని, ఇప్పటికే చెరువులు,డ్యాంలు పూర్తిగా నిండాయన్నారు. నదులు, వాగులు,నీటి ప్రవాహాలను దాటవదని, రేపు జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించామన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్దంగా వుంచామని కలెక్టర్ హరి నారాయణ తెలిపారు.మరోవైపు తిరుపతి వెస్ట్ చర్చి వద్ద ప్రమాదకర స్థాయికి చేరుకుంది నీటి ప్రవాహం. దీంతో వాహనాల అనుమతిని నిలిపివేశారు అధికారులు.…
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక.. రెండు రోజుల పాటు.. తిరుమలకు వెళ్లే రెండు నడకదారులను మూసివేయాలని నిర్ణయించింది టీటీడీ.. రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన టీటీడీ.. ముందస్తు చర్యలు చేపట్టింది.. అందులో భాగంగా.. బుధ, గురువారాల్లో తిరుమలకు వెళ్లే రెండు నడకదారులైన అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించింది… వర్షాల నేపథ్యంలో.. భక్తుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ…
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలో తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులను కొండపైకి అనుమతిస్తుండగా ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య తగ్గడంతో భక్తుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నడకదారి భక్తులు ఇబ్బంది పడ్డారని… వర్షాలు తగ్గడంతో నడకదారిలో అడ్డంకులన్నీ తొలగిపోయాయని ఆయన తెలిపారు.…
కుండపోత వర్షంతో తిరుమల కొండకు వెళ్లే దారి మూతపడింది. ఉప్పెనలా పొంగిన వరదలతో కాలినడను కూడా భక్తుడు శ్రీవారి సన్నిధికి చేరే వీలులేకుండా పోయింది. ఆర్టీసీ బస్సులను నిలిపేయడంతోపాటు, రెండు ఘాట్ రోడ్లను మూసేయాల్సి వచ్చింది.తిరుమల కొండపై కురిసిన భారీ వర్షాలకు వరద నీరు మెట్ల మార్గంలో కిందకు పారుతోంది. దీంతో భక్తులు కొండపైకి ఎక్కలేని పరిస్థితి నెలకొంది. కొండ కిందే ఉన్న కపిలతీర్థంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కొండ పైనుంచి ఉధృతంగా నీరు కిందకు…
తిరుమల వేంకటేశ్వరుని క్షణకాల దర్శనమే అమోఘం.. అద్భుతం. అలాంటిది స్వామి వారికి సేవ చేసుకోవడానికి ఎంపిక అయితే మహాద్భుతమే…! కానీ, TTDలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన 52 మందిని దురదృష్టం వెంటాడుతూనే ఉందా? వారి ఆశలు అడియాశలేనా? హైకోర్టు కామెంట్స్‌తో ఆర్డినెన్స్‌కు బ్రేక్ పడిందా లేక పూర్తిగా ఆగిపోయిందా? అసలేం జరిగింది? లెట్స్ వాచ్..! టీటీడీ బోర్డుపై ధర్మాసనం కీలక కామెంట్స్..! తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకం తర్వాత ఎదురైన సమస్యలు ఇప్పట్లో కొలిక్కివచ్చేలా లేవు.…
యంగ్ హీరో విశాల్ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నవంబర్ 4న ఆయన నటించిన “ఎనిమీ’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ‘ఎనిమీ’ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటూ కాలినడకన తిరుమల కొండను ఎక్కారు విశాల్. ఈ నేపథ్యంలో వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న విశాల్ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీవారి ఆశీస్సులు అందుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ “పునీత్ మా ఇంట్లో మనిషి…ఇన్ని రోజులైనా…
కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తుల రాక పెరిగింది. టీటీడీ ఏటా ప్రచురించే క్యాలెండర్లు, డైరీలకు మంచి డిమాండ్ వుంటుంది. తిరుమలతో పాటు హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లోని టీటీడీ దేవాలయాల్లో వీటిని విక్రయిస్తుంటారు. ఎంతో నాణ్యతతో మూర్తీభవించిన స్వామివారి క్యాలెండర్లను తమ ఇంటిలో, కార్యాలయాల్లో ఉంచుకోవడం ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు. అయితే కొందరు కేటుగాళ్ళు టీటీడీ క్యాలెండర్లు, డైరీలను ఆన్లైన్లో అధిక ధరలకు విక్రయించి క్యాష్ చేసుకుంటున్నారు. ఆన్ లైన్ లో టీటీడీ క్యాలండర్స్,డైరీల పేరుతో క్యాష్ చేసుకుంటున్న…