కుండపోత వర్షంతో తిరుమల కొండకు వెళ్లే దారి మూతపడింది. ఉప్పెనలా పొంగిన వరదలతో కాలినడను కూడా భక్తుడు శ్రీవారి సన్నిధికి చేరే వీలులేకుండా పోయింది. ఆర్టీసీ బస్సులను నిలిపేయడంతోపాటు, రెండు ఘాట్ రోడ్లను మూసేయాల్సి వచ్చింది.తిరుమల కొండపై కురిసిన భారీ వర్షాలకు వరద నీరు మెట్ల మార్గంలో కిందకు పారుతోంది. దీంతో భక్తులు కొండపైకి ఎక్కలేని పరిస్థితి నెలకొంది. కొండ కిందే ఉన్న కపిలతీర్థంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కొండ పైనుంచి ఉధృతంగా నీరు కిందకు…
తిరుమల వేంకటేశ్వరుని క్షణకాల దర్శనమే అమోఘం.. అద్భుతం. అలాంటిది స్వామి వారికి సేవ చేసుకోవడానికి ఎంపిక అయితే మహాద్భుతమే…! కానీ, TTDలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన 52 మందిని దురదృష్టం వెంటాడుతూనే ఉందా? వారి ఆశలు అడియాశలేనా? హైకోర్టు కామెంట్స్‌తో ఆర్డినెన్స్‌కు బ్రేక్ పడిందా లేక పూర్తిగా ఆగిపోయిందా? అసలేం జరిగింది? లెట్స్ వాచ్..! టీటీడీ బోర్డుపై ధర్మాసనం కీలక కామెంట్స్..! తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకం తర్వాత ఎదురైన సమస్యలు ఇప్పట్లో కొలిక్కివచ్చేలా లేవు.…
యంగ్ హీరో విశాల్ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నవంబర్ 4న ఆయన నటించిన “ఎనిమీ’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ‘ఎనిమీ’ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటూ కాలినడకన తిరుమల కొండను ఎక్కారు విశాల్. ఈ నేపథ్యంలో వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న విశాల్ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీవారి ఆశీస్సులు అందుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ “పునీత్ మా ఇంట్లో మనిషి…ఇన్ని రోజులైనా…
కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తుల రాక పెరిగింది. టీటీడీ ఏటా ప్రచురించే క్యాలెండర్లు, డైరీలకు మంచి డిమాండ్ వుంటుంది. తిరుమలతో పాటు హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లోని టీటీడీ దేవాలయాల్లో వీటిని విక్రయిస్తుంటారు. ఎంతో నాణ్యతతో మూర్తీభవించిన స్వామివారి క్యాలెండర్లను తమ ఇంటిలో, కార్యాలయాల్లో ఉంచుకోవడం ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు. అయితే కొందరు కేటుగాళ్ళు టీటీడీ క్యాలెండర్లు, డైరీలను ఆన్లైన్లో అధిక ధరలకు విక్రయించి క్యాష్ చేసుకుంటున్నారు. ఆన్ లైన్ లో టీటీడీ క్యాలండర్స్,డైరీల పేరుతో క్యాష్ చేసుకుంటున్న…
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పరిపూర్ణానంద స్వామీజీ. కరోనా బారినుండి ప్రజలు కాపాడి,తిరుమలకు మళ్లీ పూర్వ వైభవం సంతరించుకోవాలని స్వామిని వేడుకున్నానని చెప్పారు. తిరుమల కొండపై ఆహ్లాదకరమైన, అభివృద్ధిని పెంపొందిస్తూ టీటీడీ పటిష్టమైన నియమ నిబంధనలు కొనసాగించాలన్నారు. టీటీడీ మరిన్ని ధార్మిక కార్యక్రమాలను మంచి ఉత్సాహంతో ముందుకు కొనసాగించాలని స్వామిని కోరుకున్నానని పరిపూర్ణానంద స్వామీ చెప్పారు.గతంలో నిర్లక్ష్యానికి గురైన వకుళా మాత ఆలయాన్ని చాలా అద్భుతంగా పునరుద్ధరణ చేస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి…
తిరుమల శ్రీ వారి భక్తులకు తీపి కబురు చెప్పింది టీటీడీ పాలక మండలి. ఇవాళ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను విడుదల చేయనుంది. నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించిన టిక్కెట్లను ఇవాళ విడుదల చేయనున్నారు.. ఇందులో భాగంగానే ప్రతి రోజూ 12 వేల చొప్పున టికెట్లను విడుదల చేసేందుకు టీటీడీ పాలక మండలి సిద్ధమైంది… ఇక రేపు సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనుంది టీటీడీ. నవంబర్ నెలకు సంబంధించి…
అల్పపీడన ప్రభావం వల్ల తిరుమల తడిసి ముద్దయింది. కుండపోత వర్షంతో భక్తులు వణికిపోయారు. ఒకవైపు పౌర్ణమి కావడంతో కలియుగ వైకుంఠానికి భక్తులు పోటెత్తారు. దాదాపు మూడు గంటల పాటు ఎడ తెరిపి లేకుండా కురిసిన వర్షానికి వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదంగా మారిపోయింది. చలి గాలులు కూడా వీస్తుండడంతో భక్తులు బయటకు రావడానికి వెనుకాడారు. అనుకోని అతిథి రాకతో భక్తజనం ఉలిక్కిపడ్డారు. ఉరుములు, మెరుపులతో మధ్యాహ్నం వాన పడింది. తర్వాత 5 గంటల వరకు కుండపోతగా కురుస్తూనే వుంది.…
తిరుమలలో వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం పునరుద్దరించలేదని టీటీడీ తెలిపింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో 2020, మార్చి 20వ తేదీ నుంచి వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను నిలిపివేశారు టీటీడీ అధికారులు. ఇప్పటికి కూడా కోవిడ్ పూర్తి అదుపులోకి రానందువల్ల వీరి దర్శనాల విషయంలో ఇదే స్థితి కొనసాగుతోంది. అయితే గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో తిరుమలలో వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు పునరుద్ధరించినట్టు అవాస్తవ సమాచారం…
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తిరుమల పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యాయి.. రెండు రోజుల పర్యటన కోసం గురువారం రోజు తిరుపతికి వచ్చిన ఆయన.. తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని మొదట దర్శించుకున్నారు.. ఆ తర్వాత తిరుమల చేరుకున్నారు.. పద్మావతి అతిథిగృహం వద్ద సీజేఐ ఎన్వీ రమణకు ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు.. ఇక, ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. చక్రస్నానం ఘట్టంలో పాల్గొన్న ఆయన.. మూల విరాట్ అభిషేకం…