రేపటి నుంచి సీఎం జగన్ రెండు రోజులు తిరుపతిలో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం తిరుమలకు బయలుదేరనున్నారు సీఎం జగన్. మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరనున్నారు ముఖ్యమంత్రి. 3 గంటలకు రేణిగుంట ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి బర్డ్ హాస్పిటల్ లో చిన్నపిల్లల గుండె జబ్బు చికిత్స ఆసుపత్రిని ప్రారంభిస్తారు. అనంతరం అలిపిరి చేరుకుని శ్రీవారి పాదాల నుంచి తిరుమలకు నడకదారి, పై కప్పును, గోమందిరాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం తిరుమలలోని బేడి ఆంజనేయస్వామి ఆలయానికి…
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తిరుమల శ్రీవారిని దర్శించారు. తాజాగా ఆయన తన కుటుంబంతో కలిసి శ్రీవారి సన్నిధానంలో కన్పించారు. ఈరోజు ఉదయం విఐపి బ్రేక్ సమయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న దేవరకొండ కుటుంబం ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలు అందుకున్నారు. ఆలయ అధికారులు వారిని శాలువాలు కప్పి సత్కరించారు. విజయ్ దేవరకొండతో పాటు ఆయన తల్లిదండ్రులు, సోదరుడు, నటుడు ఆనంద్ దేవరకొండ కూడా ఉన్నారు. Read Also : “మా” ఎలక్షన్స్…
ఏపీ సీఎం జగన్ ఈ నెల 11, 12 తేదీల్లో తిరుపతి, తిరుమలలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 11వ తేదీ తాడేపల్లి నుంచి బయల్దేరి మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు… సీఎం. తిరుపతిలో బర్డ్ ఆస్పత్రిని ప్రారంభించడంతో పాటు… పైకప్పుతో కొత్తగా నిర్మితమైన అలిపిరి మెట్ల మార్గాన్ని, పాదాల మండపం వద్ద కొత్తగా నిర్మించిన గో మందిరాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొని… శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 11న రాత్రికి పద్మావతి…
టీటీడీ పాలకమండలి ఇవాళ జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.. జమ్మూలో శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి రూ.17.40 కోట్లతో టెండర్లకు ఆమోదముద్ర వేసింది. చెన్నై, బెంగళూరు, ముంబైలో టీటీడీ సమాచార కేంద్రాలు మరియు శ్రీవారి ఆలయాల స్థానిక సలహా మండళ్లకు ఛైర్మన్ల నియామకానికి ఆమోదం లభించగా.. చెన్నై కేంద్రానికి ఏజే శేఖర్ రెడ్డి, బెంగళూరు కేంద్రానికి రమేష్ శెట్టి, ముంబై కేంద్రానికి అమోల్ కాలేను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక, అలిపిరి కాలిబాట సుందరీకరణ…
తిరుమలలో రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లను టీటీడీ సర్వం సిద్ధం చేస్తున్నది. రేపటి నుంచి ఈనెల 15 వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ఈరోజు సాయంత్రం వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగబోతున్నది. ఇక రేపు సాయంత్రం 5:10 గంటలకు మీన లగ్నంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. రేపు రాత్రి పెద్ద శేష వాహన సేవతో వాహన సేవలు ప్రారంభం కాబోతున్నాయి. 9 రోజులపాటు వివిధ వాహనాలపై శ్రీవారు…
తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగానే పెరుగుతుంది. నిన్నటి రోజున స్వామివారిని 28422 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక 12058 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా… హుండీ ఆదాయం 2.36 కోట్లుగా ఉంది. అయితే ఈ నెల 5వ తేదిన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఆ కారణంగా 5వ తేదిన విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. 6వ తేదిన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనుండగా…7వ తేది నుంచి…
శ్రీవారి దర్శనానికి TTD అనేక వెసులుబాటులు కల్పించింది. ఆర్థిక స్థోమత.. పరిచయాల ఆధారంగా తమకు వీలైన మార్గాన్ని ఎంచుకుంటారు భక్తులు. కాకపోతే వెసులుబాటులను లాభసాటి వ్యాపారంగా చూసేవారు కూడా కొందరు ఉన్నారు. ఈ విషయంలోనే విజిలెన్స్ విభాగం అప్రమత్తంగా ఉండాలి. కానీ.. ఓ ఘటనలో TTD విజిలెన్స్ ఇచ్చిన ప్రకటన.. చర్చగా మారింది. ఆలయ పరిపాలనపై విజిలెన్స్కు అవగాహన లేదా అనే ప్రశ్నకు ఆస్కారం ఇచ్చింది ఆ ప్రకటన. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. శ్రీవాణి ట్రస్ట్…
సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార తన ప్రియుడు, డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. సోమవారం ఉదయం ఈ లవ్ బర్డ్స్ ఇద్దరూ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్న నయనతార పూజ అనంతరం ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితుల ఆశీర్వాదం పొందారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందుకున్న ఈ జంటను టీటీడీ ఆలయ…
ప్రముఖ నిర్మాత దిల్ రాజు టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న టాప్ ప్రొడ్యూసర్. ప్రస్తుతం ఆయన మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన తిరుమలను సందర్శించారు. అక్కడ శ్రీవారిని దర్శించి, పూజా తదితర కార్యక్రమాలు కావించారు. శ్రీవారి సర్వదర్శనం అనంతరం తీర్థప్రసాదాలు, పూజారుల ఆశీస్సులు అందుకున్నారు. దిల్ రాజుతో పాటు డైరెక్టర్ వంశీ పైడిపల్లి, ఆయన కుటుంబ సభ్యులు కూడా తిరుమలను సందర్శించారు. Read Also…