తిరుమలలో ఫోటోలు దిగడంతో పాటు మాడవీధుల్లో చెప్పులతో నడవడంతో నయనతార దంపతులు వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే! ఆచారాలకు విరుద్ధంగా నయా దంపతులు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. హిందూ వర్గాలు సహా టీటీడీ పాలకమండలి సైతం మండిపడ్డాయి. ఈ నేపథ్యంలోనే విఘ్నేశ్ శివన్ ముందుకొచ్చి, తమ ప్రవర్తనపై వివరణ ఇచ్చాడు. అలాగే క్షమాపణలు చెప్పాడు కూడా! ‘‘శ్రీవారి సన్నిధిలో వివాహం చేసుకోవాలని అనుకున్నాం, కానీ కుదరని పక్షంలో చెన్నైలో వివాహం చేసుకున్నాం. వివాహం తర్వాత…
వేసవి సెలవులు నడుస్తుండడంతో తిరుమలకు వెళ్ళే భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భక్తులకు కీలక సూచనలు అందించారు. భక్తుల రద్దీ కారణంగా దర్శనాల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. వరుస సెలవుల కారణంగా తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. కాగా, భక్తులకు అవసరమైన సౌకర్యాలను అందిస్తున్నామని, స్వామి వారి దర్శనం కోసం క్యూ లైన్‌లో వేచి ఉన్న భక్తులకు ఆహారం, తాగేందుకు నీరు అందిస్తున్నామన్నారు.…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. నేడు బుద్ధ పూర్ణిమ కావడం, ఆమె నటించిన ‘ధాకడ్’ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుండడంతో సినిమా విజయం అందుకోవాలని శ్రీవారిని దర్శించుకోని ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేసారు. ఇక ఈ విషయాన్నీ కంగనా తన సోషల్ మీడియా వేదికగా తెలిపింది. “ఈరోజు బుద్ధపూర్ణిమ కావడంతో నేను, ‘ధాకడ్’ చిత్ర నిర్మాత దీపక్…
తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ కలకలం రేపుతోంది. ఈనెల 7న టీటీడీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వెంకటేశ్వరప్రసాద్ ఈ చోరీకి పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయంలో విధులు ముగించుకుని బయటకు వచ్చే సమయంలో పరకామణిలో ఉద్యోగి వెంకటేశ్వరప్రసాద్ రూ.20వేలు నగదు చోరీ చేసినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు వన్‌టౌన్ సీఐ జగన్మోహన్‌రెడ్డి వెల్లడించారు…
శ్రీవారి ఆలయంలో వారపు సేవలు రద్దు చేస్తూ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. వేసవి శెలవుల సమయంలో సామాన్య భక్తులకు అధిక దర్శన సమయం కేటాయించేందుకు వారపు సేవలను టీటీడీ తాత్కాలికంగా రద్దు చెయ్యగా….వీఐపీ బ్రేక్ దర్శనాలు కొనసాగిస్తూ…స్వామివారికి నిర్వహించే వారపు సేవలు రద్దు చెయ్యడం ఏంటని ప్రశ్నిస్తున్నారు భక్తులు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారు ఎంతటి భక్తజన ప్రియుడో….అంతటి అలంకార ప్రియుడు….ఎంతటి అలంకార ప్రియుడో అంతటి ఉత్సవప్రియుడు…అందుకేనేమో శ్రీవారికి నిర్వహించే ఉత్సవాలు కాని….అలంకరణ కాని మరే ఆలయంలో…
తిరుమలలో సంచలనం కలిగించిన బాలుడి కిడ్నాప్ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. కిడ్నాప్ కి గురైన బాలుడి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సీసీటీవీ పుటేజి ఆధారంగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిన్న ఉదయం రైల్వే స్టేషన్ కి బాలుడితో సహ కిడ్నాపర్ చేరుకున్నట్టు తెలుస్తోంది. సీసీ టీవీ ఫుటేజ్‌లో ఈ విజువల్స్ కనిపిస్తున్నాయి. కిడ్నాపర్ తెలుగు భాష మాట్లాడుతున్నట్లు గుర్తించారు పోలీసులు. తిరుపతి నుంచి ట్రైన్ ద్వారా నెల్లూరు లేదా కడపకు…
*ఇవాళ ఢిల్లీలో కీలక న్యాయ సదస్సు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు,ముఖ్యమంత్రులు సదస్సు. ప్రారంభించనున్న ప్రధాని మోడీ. హాజరుకానున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ, ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. * ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం. 64 అంశాలతో అజెండాను రూపొందించిన అధికారులు * తిరుపతిలో మే 5న సిఎం జగన్ చేతులమీదుగా చిన్నపిల్లల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన. ఎస్వీ క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభం *నేడు నంద్యాలలో ఇఫ్తార్ విందులో పాల్గొననున్న డిప్యూటీ…
కలియుగ వైకుంఠం తిరుమలకు రోజూ వేలాదిమంది భక్తులు వస్తుంటారు. టీటీడీ పాలకమండలి అంటే ఎంతో ఉన్నతమయింది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో నేరచరితులు అంశం హాట్ టాపిక్ అవుతోంది. దీనిపై కోర్టులో పిటిషన్లు వేశారు. ప్రత్యేక ఆహ్వానితుల జాబితాపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డితో పాటు తనను పాలకమండలి సమావేశానికి హాజరయ్యేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ వేశారు ఎస్. సుధాకర్. అయితే, వెంటనే ఆదేశాలిచ్చేందుకు నిరాకరించింది హైకోర్టు. మరికొన్ని పిటిషన్లలో కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి,…