అరణ్యాల్లో వుండాల్సిన వన్యప్రాణులు జనారణ్యాలకు చేరుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చిరుతలు, పులుల సంచారం జనానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం గాలిబ్ నగర్ లో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులను చిరుత వెంబడించింది. బైక్ సైలెన్సర్ రేజ్ చేస్తూ… ప్రాణాలతో బయట పడ్డారు యువకులు. చిరుత సంచరిస్తున్న విషయాన్ని పోలీసులు, అటవీ శాఖ అధికారులు ధ్రువీకరించారు. మరోవైపు ఆ ప్రాంతంలో చిరుత ఆనవాళ్లు గుర్తించారు. చిరుత సంచరిస్తున్న విషయం తెలిసి గ్రామస్థులు భయంతో వణికిపోతున్నారు. చిరుతను బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. చిరుత సంచారంపై భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
Kaali Poster: కాళీ పోస్టర్‌పై వివాదం.. నోటిలో సిగరెట్, చేతిలో ఎల్జీబీటీ జెండా..
మరోవైపు తిరుపతిలోని ఎస్వీ జూపార్క్ సమీపంలో చిరుతలు తిరుగుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆప్రాంతంలోని జనం భయాందోళనలకు గురవుతున్నారు. రెండురోజుల క్రితం తిరుమల కొండ ప్రాంతంలో చిరుత కనిపించింది. ఇప్పటికే కాకినాడ జిల్లాలో బెంగాల్ టైగర్ కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. కాకినాడ నుంచి అనకాపల్లి జిల్లాలోకి పులి ప్రవేశించిన సంగతి తెలిసిందే. నక్కపల్లి మండలం తిరుపతిపాలెం దగ్గర పులి అడుగుజాడలు గుర్తించారు. తటపర్తి దగ్గర గేదెపై పులి దాడి చేసింది. పులి సంచారంతో పాయకరావుపేట పరిధిలోని శ్రీరామపురం, తిరుపతిపాలెం, తడపర్తి, వెంకటాపురం గ్రామాల్లో టెన్షన్ ఏర్పడింది. దీంతో గ్రామస్తులను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు.అనకాపల్లికి వచ్చిన పులి కాకినాడలో సంచరించే పులి ఒకటే అని తేలింది. కాకినాడ జిల్లా తుని మండలం కుమ్మరిలోవ సమీపంలోని కుచ్చులకొండ నుంచి తాండవ నది పరివాహక ప్రాంతానికి వెళుతూ తుని-కొట్టాం రోడ్డుపై పులి చేరుకుందని అధికారులు చెబుతున్నారు. నెలరోజులకు పైగా బెంగాల్ టైగర్ టెన్షన్ పెడుతోంది. పులిని పట్టుకునేందుకు అటవీ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు.
Gold Rates: స్థిరంగా బంగారం ధరలు.. మరి వెండి?