TTD: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చింది.. ప్రతి నిత్యం తిరుమల గిరులు భక్తులతో రద్దీగా ఉంటాయి.. శ్రీవారి దర్శనానికి గంటల తరబడి క్యూ లైన్లలో వేచిఉండాల్సిన పరిస్థితి ఉంటుంది.. అయితే, ఇబ్బంది లేకుండా శ్రీవారిని దర్శించుకోవడానికి ముందే టికెట్లు బుక్ చేసుకుంటారు భక్తులు.. ఇప్పటికే జనవరి నెలకు సంబంధించిన పలు సేవల టికెట్లను ఆన్లైన్లో విక్రయించిన టీటీడీ.. ఇప్పుడు భక్తుల నుంచి ఫుల్ డిమాండ్ ఉండే.. ప్రత్యేక దర్శన…
నిత్యకల్యాణం పచ్చతోరణంగా భాసిల్లే క్షేత్రం తిరుమల. తిరుమల క్షేత్రంలో ప్రతి నిత్యం నిత్యోత్సవాలు... ప్రతివారం వారోత్సవాలు... ప్రతి మాసం మాసోత్సవాలు.. నిర్వహిస్తూనే వుంటారు. స్వామివారికి సుప్రభాతం, తోమాలసేవ, అర్చన, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఏకాంత సేవ వంటి నిత్యోత్సవాలు..... విశేష పూజ , అష్టదళపాదపద్మారాధన, సహస్రకలషాభిషేకం, తిరుప్పావడ, పూలంగి సేవ, శుక్రవారాభిషేకం వంటి వారోత్సవాలు.....పుష్పయాగం, పవిత్రోత్సవం, ఆణివార ఆస్థానం, వసంతోత్సవం, జేష్ఠాభిషేకం, పార్వేటి ఉత్సవం, ప్రణయ కలహమహోత్సవం, పద్మావతి పరిణయోత్సవం వంటి వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది టిటిడి. ఏడాది…
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందడి తిరుమలలో మొదలైంది. నేటి నుంచి అక్టోబర్ 2 వరకు అత్యంత వైభవంగా జరగనున్న ఈ ఉత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ కార్యక్రమంతో వార్షిక బ్రహ్మోత్సవాలకు అధికారికంగా శ్రీకారం చుట్టినట్లయింది. ఈ వేడుకలో భాగంగా, శ్రీవారి సేనాధిపతిగా భావించే విష్వక్సేనుల వారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు.
ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు.. దివ్య మంగళ స్వరూపుడై.. రకరకాల రూపాల్లో తనకిష్టమైన వాహనాలపై ఊరేగుతూ అభయాన్ని ప్రసాదిస్తుంటే ఆ భాగ్యాన్ని వర్ణించతరమా?. కేవలం బ్రహ్మోత్సవాలకు మాత్రమే ఆవిష్కృతమయ్యే అద్భుతం ఇది. రేపటి నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.. ఇవాళ రాత్రి 7 గంటలకు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు..
డిసెంబర్ నెలలో శ్రీవారి దర్శనం కోసం ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇది మీ కోసమే.. ఎందుకంటే? డిసెంబర్ నెల దర్శనాలకు సంబంధించిన టికెట్ల విడుదల షెడ్యూల్ విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)..
Tirumala Temple Closed for 12 Hours Today: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. చంద్రగ్రహణం కారణంగా ఇవాళ 12 గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. 16 గంటల పాటు దర్శనాలు నిలిపివేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి రేపు ఉదయం 3 గంటల వరకు శ్రీవారి ఆలయంను మూసేస్తారు. ఇవాళ మధ్యహ్నం 2 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు దర్శనాలు…
చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని రేపు 12 గంటల పాటు మూసివేయనుంది టీటీడీ. ఆలయంలో 15 గంటల పాటు దర్శనాలు నిలిచిపోనుంది. మరోవైపు అన్న ప్రసాద సముదాయాన్ని కూడా రేపు మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి ఎల్లుండి ఉదయం 8:30 గంటల వరకు మూసి వేయనుంది టీటీడీ. రేపు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలతో పాటు పౌర్ణమి గరుడసేవను రద్దు చెయ్యగా.. ఎల్లుండి సిఫార్సు లేఖలపై జారీ చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ.
శేషాచలం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఎర్రచందనం. అయితే, అంతేస్థాయిలో అక్కడ వన్య ప్రాణులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చిరుతపులుల సంచారం ఎక్కువైంది. ఏనుగులు, ఇతర వైల్డ్ లైఫ్ కూడా చాలానే ఉంది. వాటిబారి నుంచి మనుషులను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో.. వేటగాళ్ల నుంచి వన్యప్రాణులను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే అటవీశాఖ టెక్నాలజీ పరంగా కొన్ని విప్లవాత్మక అడుగులు వేస్తోంది.
భక్తుల రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొండపై టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు క్యూ లైన్ విధానంలో, వసతుల కల్పనలో మార్పులు చేస్తూ వచ్చింది. 1985లో మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. 2001లో రెండో క్యూ కాంప్లెక్స్‌ను ప్రారంభించింది. ఈ రెండు కాంప్లెక్స్‌లు చాలకపోవడంతో నారాయణగిరి ఉద్యానవనంలో 2014లో తాత్కాలిక క్యూలైన్లను ఏర్పాటు చేసింది. 2019లో నారాయణగిరి ఉద్యానవనంలో కంపార్ట్మెంట్లను అందుబాటులోకి తెచ్చింది.