తెలుగు రాష్ట్రాలను చిరుతపులులు, బెంగాల్ టైగర్లు వణికిస్తున్నాయి. అడవులలో నివసిస్తూ అడవి జంతువులను వేటాడాల్సిన పులి, జనావాసాల మధ్యకు చేరి మైదాన ప్రాంతాల్లో తిరుగుతూ ఇటు అధికారులను అటు ప్రజలను కంటిమీద కునుకు లేకుండా ముచ్చెమటలు పట్టిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తుంది. రెండు రోజుల క్రితం బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలంలోకి ప్రవేశించి ఒక ఆవు పై దాడి చేసి ఆవు మెడను కొరికి వేసిన పులి, బాడంగి మండలం నుంచి బలిజిపేట మండలం మీదుగా తెర్లాం మండలంలోకి అడుగు పెట్టింది. శుక్రవారం రాత్రి తెర్లాం మండలం గొలుగు వలస గ్రామంలో ఒక ఆవు దూడపై దాడిచేసి మొక్కజొన్న తోటలోకి తీసుకువెళ్లి చంపి ఇటు తెర్లాం వాసులను భయభ్రాంతులకు గురిచేసింది.
Read Also: Arvind Kejriwal: ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీ రూ.6,300 కోట్లు ఖర్చు చేసింది..
ఇక్కడ నుంచి ఈ పులి ప్రయాణం ఎటువైపు మలుపు తిరుగుతుందో, ఎక్కడ ఎవరిమీద దాడి చేస్తుందోనని చుట్టుప్రక్కల గ్రామాల వాసులు ఆందోళనకు గురవుతున్నారు. రాత్రిళ్ళు పులి సంచరిస్తున్న ఆనవాళ్ళు సీసీ కెమేరాల్లో రికార్డయ్యాయి. దీంతో జనం వణికిపోతున్నారు. ఇదిలా వుంటే రెండురోజుల క్రితమే పులి కనిపించింది. ఎస్.కోట మండలం దొర్లపాలెం, కాపు సొంపురం పొలిమేరల్లో పులి కనిపించడంతో భయంతో పరుగులు తీశారు.
ఈసమాచారం అందుకున్న ఫారెస్ట్ సిబ్బంది. ఘటన స్థలానికి చేరుకుని పులి జాడలను గుర్తించారు. ఇటీవల ఎల్.కోట మండలం మల్లివీడు గ్రామ సమీపంలో అర్ధరాత్రి రోడ్డు దాటుతుండగా వాహనదారులకు పులి కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా దొర్లపాలెం సమీపంలో మరోసారి పులి కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు. శ్రీశైలం ఆలయం సమీపంలో అర్థరాత్రిళ్ళు చిరుత సంచారం కనిపించింది. టోల్ గేట్ సమీపంలో చిరుతపులి దేవస్థానం నైట్ డ్యూటీ సిబ్బందికి కనిపించింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు.
Read Also: Stock Market Analysis: By Prasad Dasari, Founder and CEO, Wealth Tree Group