ములుగు జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. మంగపేట మండలం చుంచపెల్లి వద్ద గోదావరి నది దాటి వచ్చిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఫారెస్టు అధికారులు పులి అడుగులు గుర్తించారు. పులి పాద ముద్రలు అనుసరించి మల్లూరు లక్ష్మి నృసింహ స్వామి క్షేత్రం వైపు వెళ్లి ఉంటుందని అంచనాకి వచ్చారు. చుంచుపల్లి, పాలయిగూడెం, ఓడగుడెం, మల్లూరు, నిలాధ్రిపేట, బాలన్నగూడెం పరిసర ప్రాంతాల ప్రజలను మైక్ అనౌన్స్మెంట్ ద్వారా అప్రమత్తం చేశారు. పులి…
కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపుతోంది. పులి జాడలను అధికారులు గుర్తించారు. పులి సంచారం నేపథ్యంలో అంకుశాపూర్ వాంకిడి వైపు వెళ్లే దారిలో సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు రాకపోకల నిషేధం విధించారు.
వికారాబాద్ జిల్లా పూడుర్ మండలంలో కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాల, గొరిల్లా గుట్ట, రహీం కోళ్లఫారం పరిసర ప్రాంతాలలో చిరుత సంచారంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.