మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో పులుల దాడులు దడ పుట్టిస్తున్నాయి. ఒకే రోజు వేర్వేరు చోట్ల ముగ్గురిపై దాడి చేశాయి. పులుల దాడులలో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఓ మహిళ, ఓ పురుషుడు ఉన్నాడు. మరో బాలుడిని అటవీ ప్రాంతంలోకి చిరుత లాక్కెళ్ళింది. బాలుడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. ఈ మూడు ఘటనలతో చంద్రపూర్ జిల్లా ఉలిక్కిపడింది. చంద్రపూర్ జిల్లా చిమూర్ తాలూకాలోని మౌజా లావరీ గ్రామానికి చెందిన మహిళ విద్యా కైలాస్ మస్రామ్…
పెద్దపల్లి జిల్లా తంగిల్లపల్లి మండలం ఇందిరానగర్ పంచాయతీ పరిధిలో చిరుత పులి కలకలం కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇందిరానగర్ పంచాయతీ పరిధిలో పులి సంచరిస్తుండటంతో గ్రామ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
కొమురం భీమ్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. పెంచికల్ పేట మండలం ముసలమ్మ గుట్ట వద్ద పులి సంచరిస్తుండటంతో గ్రామ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. లేగ దూడపై పులి పంజా విసరడంతో దూడ మృతి చెందింది. పశువులపై పులి దాడులు ఆగకపోవడంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవలే మూడు పశువులపై దాడి చేసిన పులి.. తాజాగా జిల్లేడకు చెందిన నారాయణ అనే రైతుకు చెందిన లేగ దూడను పులి చంపేసింది. కాపర్లు కేకలు పెట్టడంతో పులి సమీప…