తెలంగాణలో ఒకవైపు పులులు వీరవిహారం చేస్తున్నాయి. ఎప్పుడు ఏ పులి ఎవరి మీద పడుతుందో అనే ఆందోళన సర్వత్రా వ్యక్తం అయింది. మహారాష్ట్రలో పులి దాడిలో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. చంద్రపూర్ జిల్లా లోని తెలంగాణ సరిహద్దు లక్కడికోట్ ప్రాంతంలో పులి మనిషి పై దాడి చేసింది..తల, మొండెం వేరు వేరుగా పడి ఉంది. ఈ దాడిలో మృతి చెందిన కురిసేంగే జంగు(55)లక్కడికోట్ లోని (ఖిరిడి) గ్రామానికి చెందిన వ్యక్తి గా గుర్తించారు అధికారులు. మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. పులి దాడితో ఆ ప్రాంతంలో అలజడి రేగుతోంది. తమను పులుల దాడి నుంచి రక్షించాలని అటవీ అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు.
Read Also:Bar Code: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. మెడిసిన్స్‌పై బార్‌కోడ్ తప్పనిసరి
ఇదిలా వుంటే.. అనుమానాస్పద స్థితిలో చనిపోయిన చిరుత పులి ఒకటి అనంతపురం జిల్లాలో బయటపడింది. దాదాపుగా 10 రోజులు క్రింద చనిపోయినట్లుగా అనుమానంగా వుందన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు వివరాలు వెల్లడించారు. ఇవాళ కుందుర్పి శివారు నా అల్లి పీరా ఆశ్రమం దగ్గర్లో దయ్యాల దిబ్బ క్రింది భాగాన బోయ పాతన్న పొలం దగ్గర చిరుత పులి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా విషయం తెలుసుకున్న అటవీ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనకు సంబంధించి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాంసింగ్ మీడియాతో మాట్లాడారు. ఈ చిరుత పులి చనిపోయి దాదాపు వారం రోజులు అయి ఉంటుందని తెలిపారు. చనిపోయిన చిరుతపులి మగ చిరుత పులిగా గుర్తించారు. మరిన్ని వివరాలు ఉదయాన్నే పోస్టుమార్టం అయిన తర్వాత తెలుస్తాయన్నారు. చిరుత ఎలా మృతి చెంది ఉంటుంది ఎంత వయసు ఉంటుంది అనే విషయాలు తర్వాత తెలియచేస్తామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాంసింగ్ తెలిపారు.
Read Also: Rave party in Hyderabad: హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ.. పోలీసుల అదుపులో 37 మంది