కొమురం భీమ్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. పెంచికల్ పేట మండలం ముసలమ్మ గుట్ట వద్ద పులి సంచరిస్తుండటంతో గ్రామ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. లేగ దూడపై పులి పంజా విసరడంతో దూడ మృతి చెందింది. పశువులపై పులి దాడులు ఆగకపోవడంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవలే మూడు పశువులపై దాడి చేసిన పులి.. తాజాగా జిల్లేడకు చెందిన నారాయణ అనే రైతుకు చెందిన లేగ దూడను పులి చంపేసింది. కాపర్లు కేకలు పెట్టడంతో పులి సమీప అడవుల్లోకి వెళ్ళిపోయింది. పులిని పట్టుకొనేందుకు అటవీ శాఖ అధికారులు నానాతంటాలు పడుతున్నారు. పులి అడుగు జాడలతో ముమ్మరంగా ఆ ప్రాంతాల్ని సందర్శిస్తున్నారు.