Leopard Roaming: పులుల సంచారం తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. పులి సంచారం గ్రామాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది..అడుగుతీసి అడుగు వేయాలంటే జనం జంకుతున్నారు..పంటపొలాల వైపు వెళ్ళాలంటే జడుసుకునే పరిస్థితి ఎదురౌతోంది. పెద్దపల్లి జిల్లా తంగిల్లపల్లి మండలం ఇందిరానగర్ పంచాయతీ పరిధిలో చిరుత పులి కలకలం కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇందిరానగర్ పంచాయతీ పరిధిలో పులి సంచరిస్తుండటంతో గ్రామ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
Read also: Dussehra: ‘దసరా’కు ‘పుష్ప’ జ్ఞాపకాలు.. సేమ్ టు సేమ్ అంటూ నెటిజన్ల కామెంట్స్
లేగ దూడపై పులి పంజా విసరడంతో దూడ మృతి చెందింది. పశువులపై పులి దాడులు ఆగకపోవడంతో గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్నారు. గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు చిరుత అడుగులు గుర్తించి సంచార ఉన్నట్లుగా తేల్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బయటకు వెళ్లేప్పుడు జాగ్రత్తగా వుండాలని తెలిపారు.
China: నేటితో ముగియనున్న కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాలు.. మూడోసారి అధ్యక్షుడిగా జిన్ పింగ్..!