అధికార కూటమిలో బీజేపీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని చూస్తోంది. అంటే 25 కంటే ఎక్కువ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని కమలం పార్టీ భావిస్తోంది. దీని కోసం శివసేన (షిండే) యొక్క కొన్ని స్థానాలపై బీజేపీ కన్నేసింది.
ఏపీలో థియేటర్లలో తనిఖీలు ముమ్మరం చేశారు అధికారులు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధికంగా టికెట్ రేట్లు వసూలు చేసే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు అధికారులు. తాజాగా విజయనగరం జిల్లాలో మూడు సినిమా థియేటర్లను సీజ్ చేశారు. నిబంధనలను పాటించని సినిమా థియేటర్లపై జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ కిశోర్ కుమార్ కొరడా ఝుళిపించారు. మూడు సినిమా హాళ్లను మూసివేయాలని తాహశీల్దార్‌ను ఆదేశించారు. పూసపాటిరేగ, భోగాపురం, నెల్లిమర్ల మండలాల్లో మంగళవారం ఆకస్మికంగా పర్యటించి, సినిమా థియేటర్లను ఆయన…