పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘దే కాల్ హిమ్ ఓజీ’ (OG) సినిమా బెనిఫిట్ షో టికెట్ ఒకటి రికార్డ్ ధరకు వేలం పాటలో అమ్ముడుపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌లో జరిగిన ఈ వేలంపాటలో టికెట్ ఏకంగా రూ.1,29,999కు పలికింది. ఈ టికెట్‌ను పవన్ కల్యాణ్ హార్డ్‌కోర్ అభిమాని అయిన ఆముదాల పరమేష్ దక్కించుకున్నారు. టికెట్ నుంచి వచ్చిన మొత్తాన్ని జనసేన పార్టీ కార్యాలయానికి ఇవ్వనున్నట్లు పరమేష్ తెలిపారు. Also…