జగ్గంపేట వైసీపీ అభ్యర్థి తోట నరసింహం ప్రచారంలో స్పీడ్ పెంచారు. గోకవరం మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ప్రతిపక్ష కూటమి ఇచ్చే హామీలు నమ్మి మోసపోవద్దని సూచించారు.
కృష్ణా జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో వైసీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తోట నరసింహంకు మద్దతుగా ఆయన తనయుడు రాంజీ ప్రచారం నిర్వహించారు. గోకవరం మండలం మల్లవరం గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి తన తండ్రిని ఆశీర్వదించాలని కోరారు. గతంలో తోట నరసింహం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జగ్గంపేట అభివృద్ధిలో ముందు ఉందని గుర్తు చేశారు. జగన్ మళ్ళీ సీఎం అయితేనే సంక్షేమం, అభివృద్ధి ఫలాలు పేదలకు అందుతాయని…
రెండోసారి అధికారమే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ దూకుడుగా వెళ్తోంది. వైసీపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. జగ్గంపేట వైసీపీ అభ్యర్థి తోట నరసింహం గెలుపే లక్ష్యంగా ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఆయనకు మద్దతుగా కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలో నిర్వహిస్తున్నారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో కొత్త ఏడాదికి పొలిటికల్ కలర్ పులుముకుంది. ముఖ్యంగా వైసీపీ నేతలు విందులు, ఆత్మీయ సమావేశాలతో కేడర్‌లో జోష్ నింపే పనిలో పడ్డారు. ఈ సారి టికెట్ రాని అధికార పార్టీ నేతలు, టికెట్ వస్తుందని ఆశాభావంలో ఉన్న నాయకులు ఈ న్యూ ఇయర్‌ను గట్టిగా ప్లాన్ చేస్తున్నారు.