అసలే సినిమాల వైపు జనం పరుగులు తీయడం మానేశారని విశేషంగా వినిపిస్తోంది. అందుకు ఓటీటీ ఎఫెక్ట్ కారణమనీ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మన భారతీయ సినిమాలకు హాలీవుడ్ కామిక్ మూవీస్ కూడా దెబ్బ కొడుతున్నాయని తెలుస్తోంది. అందుకు జూలై 7న విడుదలైన మార్వెల్ మూవీ ‘థోర్: లవ్ అండ్ థండర్’ తాజా ఉదాహరణ అని చెప్పవచ్చు. ఈ సినిమా మన దేశంలో మొదటివారానికి రూ. 78 కోట్లు పోగేసింది. నిజానికి ఇంతకు ముందు వచ్చిన కామిక్ బేస్డ్…
టాలీవుడ్ లో చిన్న చిత్రాల జోరు కొనసాగుతూనే ఉంది. ఈ వీకెండ్ లో అనువాద చిత్రాలతో కలిపి ఏకంగా ఎనిమిది సినిమాలు జనం ముందుకు వస్తున్నాయి. జూన్ 7వ తేదీ హాలీవుడ్ మూవీ ‘థోర్ లవ్ అండ్ థండర్’ గ్రాండ్ వే లో రిలీజ్ అవుతోంది. అలానే గత నెలలో తమిళంలో విడుదలైన సత్యరాజ్ తనయుడు శిబి రాజ్ నటించిన ‘మయోన్’ తెలుగు డబ్బింగ్ మూవీ కూడా గురువారమే జనం ముందుకు వస్తోంది. శుక్రవారం ఆరు…
ఎట్టకేలకు ‘థోర్’ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. మార్వెల్ స్టూడియోస్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘థోర్’కు సీక్వెల్ ను విడుదల చేయడానికి సిద్ధం అవుతోంది. “థోర్ : లవ్ అండ్ థండర్” అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌ను కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన విషయం తెలిసిందే. టీజర్లో లేడీ థోర్ ను పరిచయం చేసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. తాజాగా లేడీ థోర్ పిక్ ను…
ఈ యేడాదితో పాటు వచ్చే సంవత్సరంలోనూ ఇండియాలో విడుదల కాబోతున్న తమ ప్రతిష్ఠాత్మక చిత్రాల జాబితాను, రిలీజ్ డేట్స్ ను డిస్నీ ఇండియా ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. మార్వెల్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న కామిక్స్ సీరిస్ కు చెందిన ‘ఎటర్నల్’ మూవీ ఈ యేడాది నవంబర్ 5న దీపావళి కానుకగా రానుంది. 2016లో విడుదలైన ‘డాక్టర్ స్ట్రేంజ్’కు సీక్వెల్ గా ఇప్పుడు ‘డాక్టర్ స్ట్రేంజ్: మల్టీవెర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్’ రూపుదిద్దుకుంటోంది. ఈ…
కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ తో హాలీవుడ్ స్టార్ మూవీ చేయబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. హాలీవుడ్ స్టార్ రస్సెల్ క్రో తన అభిమానుల సందేశాన్ని రీట్వీట్ చేశారు. దీంతో ఈ హాలీవుడ్ హీరో కంగనాతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడని నెటిజన్లు అనుకుంటున్నారు. “క్వీన్” ఫేమ్ కంగనా రనౌత్‌తో కలిసి పని చేయాలని తన అభిమానులు సూచించారు. ఆ ట్వీట్‌లో “రెండు విభిన్న చిత్ర పరిశ్రమలకు చెందిన ఇద్దరు గొప్ప నటులు, అకాడమీ అవార్డు…