ఎట్టకేలకు ‘థోర్’ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. మార్వెల్ స్టూడియోస్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘థోర్’కు సీక్వెల్ ను విడుదల చేయడానికి సిద్ధం అవుతోంది. “థోర్ : లవ్ అండ్ థండర్” అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌ను కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన విషయం తెలిసిందే. టీజర్లో లేడీ థోర్ ను పరిచయం చేసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. తాజాగా లేడీ థోర్ పిక్ ను షేర్ చేశారు. ఈ పిక్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్ తైకా వెయిటిటి ఈ చిత్రానికి మెగాఫోన్ పట్టారు. ఈ చిత్రంలో అవెంజర్ థోర్ గా ప్రపంచానికి బాగా పరిచయం ఉన్న క్రిస్ హేమ్స్‌వర్త్‌తో పాటు టెస్సా థాంప్సన్, నటాలీ పోర్ట్‌మన్, క్రిస్టియన్ బేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Read Also : Ram Charan : ‘ఆర్ఆర్ఆర్’ చేస్తూనే ‘ఆచార్య’ను ఎలా కవర్ చేశాడంటే ?
ఇక టీజర్ విషయానికొస్తే… ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ ఎండింగ్ నుంచి ఈ మూవీ స్టార్ట్ అవుతున్నట్టుగా కన్పిస్తోంది. ఆ మూవీలోని లుక్ ను ఇందులో కూడా కంటిన్యూ చేశారు. రెస్ట్ మోడ్ లో ఉన్న థోర్ కు మళ్ళీ తన ప్రపంచానికి వెళ్లి, కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది. గోర్ ది గాడ్ బుట్చేర్ (క్రిస్టియన్ బాలే) అనే గెలాక్సీ కిల్లర్ దేవుళ్ళను అంతరించిపోవాలని కోరుకోవడం ఈ ఫైట్ కు కారణమవుతుంది. కింగ్ వాల్కైరీ (టెస్సా థాంప్సన్), కోర్గ్ (తైకా వెయిటిటి), మాజీ ప్రియురాలు జేన్ ఫోస్టర్ (నటాలీ పోర్ట్‌మన్) అకా మైటీ థోర్ సహాయంతో థోర్ తన ప్రపంచాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేది బిగ్ స్క్రీన్ పై చూడాల్సిందే. అడ్వెంచరస్ మూవీ “థోర్ : లవ్ అండ్ థండర్” జూలై 8న భారతదేశంలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.