కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ తో హాలీవుడ్ స్టార్ మూవీ చేయబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. హాలీవుడ్ స్టార్ రస్సెల్ క్రో తన అభిమానుల సందేశాన్ని రీట్వీట్ చేశారు. దీంతో ఈ హాలీవుడ్ హీరో కంగనాతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడని నెటిజన్లు అనుకుంటున్నారు. “క్వీన్” ఫేమ్ కంగనా రనౌత్‌తో కలిసి పని చేయాలని తన అభిమానులు సూచించారు. ఆ ట్వీట్‌లో “రెండు విభిన్న చిత్ర పరిశ్రమలకు చెందిన ఇద్దరు గొప్ప నటులు, అకాడమీ అవార్డు విజేత రస్సెల్ క్రో, 4 సార్లు జాతీయ అవార్డు విజేత కంగనా రనౌత్ కలిసి సినిమా చేస్తే ఎంత బాగుంటుంది?” అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే అది సినిమా ప్రియుల్లో విపరీతమైన అంచనాలకు దారితీసింది. 2000 సంవత్సరంలో రిడ్లీ స్కాట్ “గ్లాడియేటర్”లో ఉత్తమ నటనకు రస్సెల్ క్రో అకాడమీ అవార్డును గెలుచుకున్న విషయం తెలిసిందే.
Read Also : యంగ్ హీరో నిఖిల్ కు కమిషనర్ ప్రశంసలు
రస్సెల్ క్రోవ్ నోహ్, ఎ బ్యూటిఫుల్ మైండ్, ది నైస్ గైస్, మ్యాన్ ఆఫ్ స్టీల్ వంటి చిత్రాలలో నటించి స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన క్రిస్ హేమ్స్‌వర్త్, నటాలీ పోర్ట్‌మ్యాన్, క్రిస్టియన్ బేల్ నటించిన “థోర్: లవ్ అండ్ థండర్ కో”లో కనిపించనున్నాడు. మరోవైపు కంగనా రనౌత్ చివరిసారిగా అశ్విని అయ్యర్ తివారి “పంగా”లో కనిపించింది. ప్రస్తుతం బహుభాషా చిత్రం “తలైవి”లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో ఆమె తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితగా నటిస్తుంది. ఆమె మరో చిత్రం “తేజస్”లో కూడా పైలట్ పాత్రలో నటిస్తోంది.
How great it would be if two great actors from two different film industries, Academy award winner @russellcrowe and 4 times National Awards winner #KanganaRanaut make a movie together ? pic.twitter.com/cLFFfcBGpF
— Soumya (@AnshCherr) August 13, 2021