(అక్టోబర్ 23న ‘తూర్పు-పడమర’ 45 ఏళ్ళు పూర్తి)ఒకప్పుడు తెలుగునాట దాసరి నారాయణరావు, తమిళనాట కె.బాలచందర్ పబ్లిసిటీలో తమ పేర్లను మబ్బుల్లో వేసుకొనేవారు. వారిద్దరి చిత్రాల్లోనూ స్త్రీ పక్షపాతం కనిపించేది. తమిళంలో కె.బాలచందర్ తెరకెక్కించిన ‘అపూర్వ రాగంగల్’ ఆధారంగా తెలుగులో దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘తూర్పు-పడమర’ చిత్రం రూపొందింది. దాసరిని దర్శకునిగా పరిచయం చేసిన ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత కె.రాఘవ ఈ ‘తూర్పు-పడమర’ను నిర్మించారు. తమిళంలో ప్రధాన పాత్ర పోషించిన శ్రీవిద్య ఇందులోనూ తన పాత్రలో తానే…